మీ పార్ట్ నర్ ఇలా చేస్తున్నారా..? అయితే.. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లే..!

First Published | Sep 22, 2022, 11:17 AM IST

మీ జీవిత భాగస్వామి దానిని పెద్ద ఇష్యూ చేయకుండా... సులభంగా మిమ్మల్ని క్షమించేస్తున్నారు అంటే కూడా.. వారు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారని అర్థం.

తమ జీవితభాగస్వామి తమను అమితంగా ప్రేమించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... చాలా మందికి తమ జీవిత భాగస్వామి ప్రేమ కురిపించినా... అది నిజమైన ప్రేమ అని గుర్తించడం లేదట. అసలు మిమ్మల్ని మీ పార్ట్ నర్ పిచ్చిగా ప్రేమిస్తే... ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం...

1. మీ పార్ట్ నర్ ఎక్కువ పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా.. మీరు చెప్పే విషయాలను, సమస్యలను ఓపికగా వింటున్నారు అంటే... వారికి మీ మీద పిచ్చి ప్రేమ ఉన్నట్లే అర్థం.


2.మీరు ఎంత పెద్ద తప్పులు చేసినా...మీ జీవిత భాగస్వామి దానిని పెద్ద ఇష్యూ చేయకుండా... సులభంగా మిమ్మల్ని క్షమించేస్తున్నారు అంటే కూడా.. వారు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారని అర్థం.
 

3.దంపతులు ఇద్దరికీ ఒక్కో రకం అభిరుచులు ఉంటాయి.  మీరు ఏదైనా కొత్తవి నేర్చుకోవాలన్నా.. మీ అభిరుచులు మార్చుకున్నా.... మీకు అనుగుణం మీ భాగస్వామి కూడా మారుతూ.. మీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటే.. వారికి  మీ మీద అమితమైన ప్రేమ ఉందని అర్థం.

4.సందర్భంతో పని లేకుండా.... మీకు పూలు, బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేసి.. మీ సంతోషానికి కారణమౌతున్నారంటే...  వారు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారనే అర్థం.
 

5.మీ మీద ప్రేమను.. ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో బయటపడుతూ మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు అంటే.. వారు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారని అర్థం.

6.మీ పార్ట్ నర్ ఏదైనా తప్పు చేస్తే... ఆ సమయంలో.. వారు మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు చెబుతున్నారు అంటే కూడా వారికి మీ మీద పిచ్చి ప్రేమ ఉన్నట్లే..


7.మిమ్మల్ని మీ పార్ట్ నర్ నిజంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని పొందడానికి.. మీ కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే.. వారికి  మీ మీద ప్రేమ ఉన్నట్లే అర్థం.

Latest Videos

click me!