సెక్స్ సమయంలో మ్యూజిక్... మరింత కిక్ ఇస్తుందా..!

First Published | Sep 21, 2022, 12:19 PM IST

రొమాంటిక్ సాంగ్స్ వింటూ.. కలయికలో పాల్గొంటే... మీ భాగస్వామిని మరింత దగ్గరకు తీసుకోవాలని.. వారిని ముద్దాడాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందని వారు చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో మ్యూజిక్ మాయాజాలంలా పనిచేస్తుందట.

సంగీతం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. మధురంగా పాటలు వింటుంటే.. మనకు తెలీకుండానే టెన్షన్ తగ్గిన భావన కలుగుతుంది. అంతేకాదు.. మనకు తెలీకుండానే ఒకరకమైన మధురమైన భావన కూడా కలుగుతుంది. ఓ మంచి అనుభూతికి కలిగిస్తుంది. అలాంటి సంగీతాన్ని కలయికలో పాల్గొంటున్న సమయంలో వింటే.. మరింత అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రొమాంటిక్ సాంగ్స్ వింటూ.. కలయికలో పాల్గొంటే... మీ భాగస్వామిని మరింత దగ్గరకు తీసుకోవాలని.. వారిని ముద్దాడాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందని వారు చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో మ్యూజిక్ మాయాజాలంలా పనిచేస్తుందట.

 మీ శరీరం సంగీతం  లయకు అనుగుణంగా కదులుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది లైంగిక సంపర్కానికి ప్రేరణనిస్తుంది. కొంతకాలంగా మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లోపిస్తే సంగీతం మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న అభిరుచిని పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది.


మీరు ఒంటరిగా సంగీతాన్ని వింటున్నప్పుడు మీరు ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటారు కాబట్టి సంగీతం ఏ పరిస్థితిలోనైనా ఉల్లాసకరమైన అనుభూతిని ఇస్తుంది. మీరు మీ స్నేహితులతో ఉన్నప్పుడు  పెద్దపెద్ద సౌండ్ వచ్చే మ్యూజిక్ వినడాన్ని ఆనందిస్తారు. కానీ... సెక్స్ సమయంలో మాత్రం.. కాస్త సౌమ్యంగా.. మనసుకు హాయి కలిగించే లాంటి మ్యూజిక్ వినాలట. 

శృంగార సమయంలో సంగీతం వింటే మరింత మెరుగ్గా కలయికలో పాల్గొనడానికి అసలు కారణాలు ఇవే..

సంగీతం మిమ్మల్ని నిలువరించదు. మీరు సంగీతం విన్నప్పుడు, మీరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉంటారు. సెక్స్‌కు సంబంధించిన ఏవైనా ఆలోచనలు ,అడ్డంకులు మిమ్మల్ని వెనక్కి నెడుతున్నాయి అంటే.. ఆ సమయంలో సంగీతం వింటే... ఆ వ్యతిరేక భావనలు తగ్గి... కోరికలు కలుగుతాయట. మీరు శృంగారంలో  పాల్గొంటున్న సమయంలో సంగీతం వింటున్నప్పుడు, కొత్తగా ప్రయత్నించాలని, లైంగికంగా మరింత సాహసోపేతంగా ఉండాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది.
 

సంగీతం ఒత్తిడిని తొలగిస్తుంది. శృంగారంలో ఉన్నప్పుడు సంగీతం వినడం వలన మీ ఒత్తిడిని తగ్గించవచ్చు. మీరు ఉద్వేగం పొందగలిగే స్థాయికి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. మీ శరీరం, మనస్సు ఒత్తిడికి గురైనప్పుడు, ఉద్వేగం పొందే అవకాశం చాలా తక్కువ.

కానీ సంగీతం...మీ కదలికలు, లయలను మెరుగుపరుస్తుంది. సెక్స్ సమయంలో, సరైన లయను పొందడం ఒక సవాలుగా మారుతుంది. దీన్ని సరైన మార్గంలో చేయడంలో సంగీతం మీకు సహాయపడుతుంది. సంగీతంలోని లయ తదనుగుణంగా కదలడానికి మిమ్మల్ని ప్రేరేపించగలదు. ఇది మీ పనితీరు, లైంగిక సంతృప్తిని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.
 

ప్రతి ఒక్కరూ సెక్స్ సమయంలో సంగీతం వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు తమ భాగస్వామి  సహజ మూలుగులు, శబ్దాలను వినాలని  కోరుకుంటారు. కానీ సంగీతం సెక్స్ సమయంలో ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందట. భావప్రాప్తి పొందడడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!