Fake Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని ప్రేమించినట్లు నటించేవాళ్లు ఎలా ఉంటారో తెలుసా?

Published : Feb 09, 2026, 11:07 AM IST

మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం ఈజీనే. కానీ ఆ ప్రేమ నిజమా, లేక నటనా అన్నది గుర్తించడం కష్టం. కొన్ని సంబంధాల్లో మాటలు మధురంగా ఉంటాయి. కానీ కాలం గడిచేకొద్దీ అసలు రూపం బయటపడుతుంది. సైకాలజీ ప్రకారం మనపై ప్రేమ నటించే వాళ్లు ఎలా ఉంటారో చూద్దాం. 

PREV
17
Fake Love Psychology

మనల్ని ప్రేమిస్తున్నట్లు నటించే వాళ్లను గుర్తించడం చాలా కష్టం. బయటకు చూస్తే వాళ్ల మాటలు మధురంగా ఉంటాయి, ప్రవర్తన ఆప్యాయంగా కనిపిస్తుంది, మన కోసం అన్నట్టు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ లోపల మాత్రం వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. సైకాలజీ ప్రకారం, ఇలాంటి నటనతో కూడిన ప్రేమను తొందరగా గుర్తించగలిగితే మన భావోద్వేగాలను, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనల్ని ప్రేమించినట్లు నటించే వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

27
మాటల్లో ఎక్కువ ప్రేమ

ప్రేమించినట్లు నటించే వ్యక్తులు మాటల్లో ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. కానీ చర్యల్లో స్థిరత్వం ఉండదు. సైకాలజీ ప్రకారం నిజమైన ప్రేమ రోజువారీ చిన్నచిన్న పనుల్లో కనిపిస్తుంది. కానీ నటించే వాళ్లు అవసరమైనప్పుడు మాత్రమే ప్రేమను ప్రదర్శిస్తారు. మీకు అవసరం ఉన్నప్పుడు దూరంగా ఉండటం, వారి అవసరాల కోసం దగ్గరగా రావడం వీరి లక్షణం. మాటలకు, పనులకు మధ్య తేడా కనిపించడం మొదటి హెచ్చరికగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు.

37
మీ భావాల్ని లెక్కచేయకపోవడం

మీరు బాధలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు వారు మీ మాటలు వినే ప్రయత్నం చేసినట్టు నటిస్తారు. కానీ నిజంగా లోతుగా కనెక్ట్ కారు. మీ భావాల్ని చిన్నచూపు చూడటం, “అది అంత పెద్ద విషయమే కాదు” అని తేలిగ్గా కొట్టిపారేయడం వీరి సహజ స్వభావం. దానివల్ల మీరు క్రమంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు.

47
నిర్ణయాలపై నియంత్రణ

సైకాలజీ ప్రకారం ప్రేమ నటించేవాళ్లు ప్రేమ పేరుతో మీ నిర్ణయాలపై నియంత్రణ చూపుతారు. మీరు ఎవరితో మాట్లాడాలో, ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించాలనుకోవడం వీరి సాధారణ లక్షణం. నిపుణుల ప్రకారం ఇది ప్రేమ కాదు, అసురక్షిత భావం, ఆధిపత్య భావన. ఇలాంటి సంబంధాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతుంది.

57
కాస్త వ్యతిరేకంగా ఉన్నా..

మీరు ఏ విషయంలోనైనా మీకోసం నిలబడినా, మీ అభిప్రాయం చెప్పినా, వెంటనే “నిన్ను నేను ఇంత ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ఈమాత్రం కూడా అర్థం చేసుకోలేదా?” అంటూ బాధితుల్లా ప్రవర్తిస్తారు. దీనివల్ల మీరు మీ నిర్ణయాలను మార్చుకుంటారు.

67
నిజంగా సంతోషించరు

మీ విజయాల్లో, మీ ఆనందంలో వారు నిజంగా సంతోషించరు. మీరు బలంగా, స్వతంత్రంగా మారుతున్న కొద్దీ వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం, నిజమైన ప్రేమ ఎదుటివారిని ఎదగనివ్వాలని కోరుకుంటుంది. కానీ నటించే ప్రేమ మాత్రం ఎదుటివారి బలహీనతలపైనే ఆధారపడి ఉంటుంది. మీరు వారి అవసరాలకు తగ్గట్టు ఉన్నంతవరకే వారు ప్రేమ చూపిస్తారు.

77
ఇలాంటి బంధంలో ఉన్నవారు..

నిపుణుల సూచనల ప్రకారం, ఇలాంటి సంబంధాల్లో ఉన్నప్పుడు మొదట మీ భావాల్ని మీరు గమనించాలి. స్పష్టమైన సరిహద్దులు పెట్టుకోవాలి. మీ అవసరాలు, అభిప్రాయాలు చెప్పినప్పుడు ఎదుటివారు ఎలా స్పందిస్తున్నారో గమనించాలి. అవసరమైతే సైకాలజీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories