Relationship Psychology: అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారిలో కనిపించే 5 లక్షణాలివే! కావాలంటే చెక్ చేసుకోండి

Published : Feb 02, 2026, 02:56 PM IST

అక్రమ సంబంధం.. తప్పుడు బంధం అని అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఆ తప్పుడు బంధం వైపే మొగ్గుచూపుతుంటారు, ఆకర్షితులవుతుంటారు. అలా కావడం వెనుక కారణాలు ఏంటి? అక్రమ సంబంధంలో ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఏంటి? వీరి గురించి సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం.

PREV
16
Extramarital Relationships

అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తులను, సమాజం.. సాధారణంగానే తప్పుగా, నీచంగా లేదా నైతికంగా బలహీనులుగా ముద్ర వేస్తుంది. కానీ సైకాలజీ నిపుణుల  ప్రకారం, అక్రమ సంబంధాలు ఒక వ్యక్తి చెడ్డవాడు, లేదా మంచివాడు అన్నది నిర్ణయించవు. అవి ఆ వ్యక్తి మానసిక అవసరాలు, తీరని భావోద్వేగాలు, అంతర్గత సంఘర్షణలను బయటపెడతాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం, అక్రమ సంబంధాల్లో ఉన్నవారిలో సాధారణంగా కనిపించే ఐదు లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
భావోద్వేగ లోటు

సైకాలజీ ప్రకారం చాలామంది అక్రమ సంబంధాల్లోకి శారీరక కోరికతో కాదు, భావోద్వేగ లోటుతో అడుగుపెడతారని సైకాలజీ చెబుతోంది. పెళ్లి లేదా ప్రేమ సంబంధంలో ఉన్నప్పటికీ, మాట్లాడుకునే అవకాశం లేకపోవడం, వినిపించుకునే మనిషి లేనట్టు అనిపించడం, నిర్లక్ష్యం లేదా అవమానం ఎదురుకావడం వంటి వాటివల్ల వారు లోపల ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఆ లోటును ఎవరో ఒకరు అర్థం చేసుకొని, శ్రద్ధ చూపించినప్పుడు ఆ బంధం వారికి చాలా విలువైందిగా అనిపిస్తుంది. ఈ దశలో అక్రమ సంబంధం వారికి తప్పుగా కాకుండా ఆశ్రయంలా అనిపిస్తుంది.

36
వేర్వేరు వ్యక్తిత్వాలు

అక్రమ సంబంధాల్లో ఉన్నవారిలో చాలామంది రెండు వేర్వేరు వ్యక్తిత్వాలతో జీవిస్తుంటారు. ఒకటి కుటుంబం ముందు, సమాజం ముందు చూపించే ముఖం. మరొకటి వారు దాచిపెట్టే నిజమైన భావాలు. అంటే ఫోన్‌ దాచడం, చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పడం, అకస్మాత్తుగా ప్రైవసీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. సైకాలజీ ప్రకారం ఇది కేవలం మోసం చేయాలనే ఉద్దేశం కాదు, గిల్ట్, భయం, పట్టుబడతామనే ఆందోళన వల్ల ఏర్పడే ప్రవర్తన.

46
వ్యసనంలా మారడం

సైకాలజీ ప్రకారం అక్రమ సంబంధాలు అందించే ఉత్సాహం, కొత్తదనం, రిస్క్ వంటివి మెదడులో డోపమైన్ అనే కెమికల్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీని వల్ల ఆ అనుభూతి చాలా బలంగా, వ్యసనంలా అనిపిస్తుంది. దీర్ఘకాలిక ఫలితాలు, పరిణామాలు గురించి ఆలోచించకుండా “ఇప్పుడు బాగుంది” అన్న భావనకే వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది వ్యక్తిని మరింత లోతుగా ఆ సంబంధంలోకి లాగుతుంది.

56
ఈ సందేహాలు బలంగా..

అక్రమ సంబంధాల్లో ఉన్న కొంతమందిలో.. నాకు విలువ ఉందా?, నన్ను ఎవరైనా కోరుకుంటారా? అనే సందేహాలు బలంగా ఉంటాయి. పెళ్లి లేదా ప్రేమ సంబంధంలో అప్రిసియేషన్ తగ్గిపోయినప్పుడు, బయట నుంచి వచ్చే అటెన్షన్ వారికి తమ విలువను గుర్తు చేస్తుంది. కానీ నిపుణుల ప్రకారం ఇది ఆరోగ్యకరమైన ఆత్మవిశ్వాసం కాదు, ఇది పూర్తిగా బయటి వ్యక్తి మీద ఆధారపడే అస్థిరమైన భావన.

66
తప్పు చేస్తున్నాననే భావన..

సైకాలజీ విశ్లేషణల ప్రకారం.. అక్రమ సంబంధాల్లో ఉన్నవారు తరచూ మనసులోనే కారణాలు తయారు చేసుకుంటారు. “నన్ను అర్థం చేసుకునే వాళ్లు లేరు”, “నా పరిస్థితి వేరు”, “ఇలా చేయడం తప్పు కాదు” వంటివి అనుకుంటారు. తప్పు చేస్తున్నాననే భావనను తగ్గించుకోవడానికి వారిని వారే ఇలా మోసం చేసుకుంటారు. ఇలా చేస్తూ పోతే.. తప్పు, ఒప్పుల మధ్య గీత మసకబారిపోతుంది. 

సైకాలజీ నిపుణుల ప్రకారం ఈ లక్షణాలను చూసి వ్యక్తులను తప్పుబట్టడం కాదు, వారి లోపలి తీరని అవసరాలను అర్థం చేసుకొని, వాటిని పరిష్కరించుకున్నప్పుడే సంబంధాలు ఆరోగ్యకరంగా మారతాయి.

Read more Photos on
click me!

Recommended Stories