Chanakya Niti: ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!

Published : Oct 05, 2025, 02:35 PM IST

ఆచార్య చాణక్యుడు ప్రేమ, పెళ్లి గురించి చాణక్య నీతిలో చాలా విషయాలు పొందుపరిచాడు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటారో.. మనకోసం ఏం చేస్తారో.. వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త. స్నేహం, ప్రేమ, పెళ్లి బంధాలను చక్కగా విశ్లేషించిన గురువు. ఆయన నీతి సూత్రాలు బంధాలపై అద్భుతమైన అవగాహన కల్పిస్తాయి. ఆయన నీతి సూత్రాలు వింటే.. ఏ బంధం ప్రత్యేకమైనది? ఏ బంధం కుట్రపూరితమైనదో సులభంగా తెలుసుకోవచ్చు. చాణక్య నీతి ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. 

సాధారణంగా ఆడ, మగ ప్రేమలో పడటం సహజం. కానీ ఆ ప్రేమ నిజమైనదో లేదో తెలుసుకోవడమే కష్టం. కొందరు వేరే ఉద్దేశాలతో కూడా ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు. కానీ నిజంగా ప్రేమించే వారి ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని చాణక్యనీతి చెబుతోంది. అవేంటో చూద్దాం. 

25
తరచూ గమనించడం

మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడో లేదో వారి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది తరచూ గమనించడం. ఒక వ్యక్తి తరచూ గమనిస్తున్నారంటే.. మీపై ఆసక్తి ఉన్నట్టు అర్థం. మిమ్మల్ని చూసిన వెంటనే చూపు తిప్పుకోవడం, పదేపదే చూడటం ఇష్టానికి సంకేతాలు. మీతో మాట్లాడటానికి సిగ్గుపడినా లేదా పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లని చాణక్య నీతి చెబుతోంది. 

35
మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం

ఒక వ్యక్కి మీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం తన ప్రేమకు సంకేతం. మిమ్మల్ని చూసి నవ్వడం, మాట్లాడేటప్పుడు కొద్దిగా వంగడం గౌరవానికి, ఇష్టానికి గుర్తుగా చెప్పవచ్చు. మీతో ఎక్కువగా మాట్లాడినా, పదే పదే మీ చుట్టూ తిరిగినా, మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై కూడా ఆసక్తి చూపిస్తే.. వారు మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నట్లేనని చాణక్య నీతి చెబుతోంది.

45
శ్రద్ధ చూపడం

ఒక వ్యక్తి నిజంగా ఇష్టపడితే తెలియకుండానే వారు మనపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అవసరం లేకపోయినా పదే పదే మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం వంటి వారి ఇష్టానికి సంకేతాలు. మీరు ఇతరులతో స్నేహంగా ఉంటే అసూయపడటం. లోలోపల ఫీల్ కావడం వంటివి నిజమైన ప్రేమ లక్షణాలని చాణక్యుడు తన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు.

55
సాయం చేయడం

ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడితే లేదా ప్రేమిస్తే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు. మీ సంతోషాన్ని, విజయాన్ని తమ సంతోషంగా భావిస్తారు. ఒక వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తే వారి మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉన్నట్లేనని చాణక్యుడు చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories