Relashionship: మీ మాజీ లవర్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే తను మళ్లీ మిమ్మల్ని కోరుకుంటున్నట్లే?

Published : Jul 28, 2023, 03:29 PM IST

Relashionship: ఒకసారి ముగిసిపోయిన బంధాన్ని మళ్లీ ఏర్పరుచుకోవాలని ఎవరు అనుకోరు కానీ కొందరు తమ తప్పు తెలుసుకొని మళ్లీ మాజీ లవర్ కి దగ్గర అవటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకి ఈ లక్షణాలు ఉంటాయంట అవేంటో చూద్దాం.  

PREV
16
Relashionship: మీ మాజీ లవర్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే తను మళ్లీ మిమ్మల్ని కోరుకుంటున్నట్లే?

ఒక బంధం ముగిసిపోయిన తరువాత మళ్లీ అతను తన తప్పు తెలుసుకుని మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నట్లయితే అతనికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మీ మాజీ బాయ్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసినట్లయితే అతను ఉన్న ప్రదేశం మరిచిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు.
 

26

వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకున్నట్లయితే అతని మనసులో మీరు ఇంకా ఉన్నట్లే అర్థం. అలాగే అతను మళ్లీ మిమ్మల్ని కావాలనుకుంటున్నట్లు అర్థం. అతను పదేపదే  ఫోన్ చేసి సారీ వేరే వాళ్ళు చేయబోయి నీకు వచ్చేసింది అని చెప్తున్నట్లయితే అది అబద్ధం.
 

36

అతను మీతో మాట్లాడటానికి ఫోన్ చేసి ఏం మాట్లాడాలో తెలియక కంగారు పడుతున్నాడు. ఆ విషయం మీకు అప్పటికే అర్థమయి ఉంటుంది. అలాగే మీతో మాటలు కలపటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పటి మీ జీవితం గురించి వాకబు చేస్తూ ఉంటాడు.
 

46

పాత రిలేషన్ ని మీకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నాడంటే కచ్చితంగా అతను మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు వేరొక వ్యక్తులతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అతను పొసెసివ్గా ఫీల్ అవుతున్నాడు అంటే దాని అర్థం మీకు ఈపాటికి అర్థం చేసుకొని ఉంటారు.
 

56

అలాగే మీ చుట్టూ తన వైబ్రేషన్స్ ఉండటం కోసం మీ స్నేహితులతో తన బంధాన్ని మెరుగుపరుచుకుంటాడు. వారి దగ్గర నుంచి మీ ప్రస్తుత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. అలాగే పాత సంఘటనలని తలుచుకొని మీకు క్షమాపణ చెప్తున్నాడు అంటే జరిగిన దానికి అతను చాలా బాధపడుతున్నాడని అర్థం.
 

66

 మళ్లీ మిమ్మల్ని తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఇవన్నీ కుదరనప్పుడు అతని స్నేహితులని రాయబారానికి మీ దగ్గరకి పంపిస్తున్నాడంటే కచ్చితంగా అతను మీకోసం పడి చస్తున్నాడని అర్థం. కాబట్టి ఈ సంకేతాలని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం ఇకపై మీ వంతు.

click me!

Recommended Stories