Relationship: మీ వివాహేతర సంబంధం గురించి మీ భాగస్వామికి చెప్పాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్రయత్నించండి?

First Published | Jul 28, 2023, 3:00 PM IST

Relationship: వివాహేతర సంబంధం.. చక్కనైన కాపురంలో చిచ్చు పెడుతున్న ఈ విషయం గురించి భాగస్వామికి చెప్పటం కఠినమైన సందర్భమే కానీ  ఇలా సున్నితంగా చెప్పే ప్రయత్నం ఎలా చేయాలో చూద్దాం.
 

ముచ్చటైన కాపురం ముక్కలైపోవటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి అందులో ఒకటి వివాహేతర సంబంధం. అయితే చక్కనైన భాగస్వామి ఉన్నప్పటికీ వివాహేతర సంబంధానికి తెర లేపుతున్నారు చాలామంది భార్యలూ,భర్తలు.
 

అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆ వివాహేతర సంబంధం చక్కనైన కాపురానికి ఎసరు పెడుతుంది అని తెలుసుకునే సమయానికి పరిస్థితులు మీ చేయి దాటి పోవచ్చు. కాబట్టి ఇదే విషయాన్ని మీ భాగస్వామికి చెప్పి తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా..
 

Latest Videos


Image: Getty

ఈ సందర్భాన్ని మీ భాగస్వామి ఎలా తీసుకుంటారో అని సందిగ్ధతకి  గురవుతున్నారా.. అయితే ఒక అడుగు ముందుకు వేయండి ఈ విధంగా ప్రయత్నించి చూడండి తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తగిలిన వెనకడుగు వేయకండి. మీరు ఈ విధంగా ఎందుకు వివాహేతర సంబంధానికి పాల్పడ్డారు మీ భాగస్వామికి చెప్పే ప్రయత్నం చేయండి.
 

అది మీలో అపరాధ భావాన్ని తగ్గించటమే కాకుండా మీ భాగస్వామికి మీ నిజాయితీని తెలియజేసిన వారవుతారు. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు భాగస్వామి హడావిడిగా ఉండే సమయంలో మాట్లాడకండి. ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త సమయం కేటాయించుకుని నిదానంగా విషయాన్ని చెప్పటం ప్రారంభించండి.
 

అలా చెప్పేటప్పుడు ఏ విషయాన్ని దాచకండి. అలాంటి సమయంలో మీ భాగస్వామి కొంత ఉద్రిక్తతకి గురవడం  సహజమే. అందుకు మీరు సిద్ధంగా ఉండండి అవతరి వారు వేసే ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పడం వలన తిరిగి మీ భాగస్వామి నమ్మకాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే చెప్పదలుచుకున్న దాన్ని సాగదీయకుండా సూటిగా ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పండి.
 

అలా చెప్పేటప్పుడు నా తప్పేమీ లేదు అంటూ మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయకండి. అది మీ భాగస్వామికి మీ పై ఉండే సాఫ్ట్ కార్నర్ పై దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవటం మీ భాగస్వామికి కష్టమే అటువంటి అప్పుడు మీ పూర్తి మద్దతు అతనికి ఇవ్వండి. అప్పుడు ఇద్దరూ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

click me!