ఫ్లేవర్డ్ కండోమ్లను వాడితే అంతే సంగతా?

First Published Jan 6, 2024, 2:43 PM IST

కండోమ్ లను వాడటం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. అలాగే అవాంఛిత గర్భం వచ్చే అవకాశం కూడా ఉండదు. అయితే చాలా మంది ఫ్లేవర్డ్ కండోమ్లను కూడా వాడుతుంటారు. కానీ వీటి వాడకం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనీలా, మామిడి, బబుల్గమ్, ఊరగాయ, అల్లం మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. ఈ ఫ్లేవర్ లల్లో కండోమ్స్ ఈజీగా దొరుకుతాయి. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ కండోమ్ ను కొనొచ్చన్న మాట. దీనిలో తప్పేం లేదు. వయోజనులు, లైంగికంగా చురుకుగా ఉంట వారు సెక్స్ ను మరింత ఉత్తేజంగా మార్చడానికి వీటిని ప్రయత్నించొచ్చు. సెక్స్ లైఫ్ లో ఏదైనా స్పెషల్ గా చేయాలనుకునే వారు ఈ ఫ్లేవర్డ్ కండోమ్స్ గురించి చాలా ఎక్సైటింగ్ గా ఫీలవుతారు. మెరిసేదంతా బంగారం కాదన్నట్టే.. కండోమ్లు కూడా అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అవును ఫ్లేవర్డ్ కండోమ్ లను వాడటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. 
 

condoms

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ఓరల్ సెక్స్ లో పాల్గొన్న  ప్రొఫెషనల్ సెక్స్ వర్కర్లలో 50 శాతం మంది కండోమ్లను ఉపయోగించడానికి నిరాకరించారని పరిశోధకులు కనుగొన్నారు. ఫ్లేవర్డ్ కండోమ్ ఉన్నప్పుడు వారు దానిని ఉపయోగించడానికి అంగీకరించారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన సిఫార్సుల ప్రకారం.. క్లామిడియా, గోనేరియా, సిఫిలిస్, హెచ్పివి అలాగే హెచ్ఐవి వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు ఓరల్ సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి.

లైంగికంగా చురుగ్గా ఉండే పెద్దలలో 85% మందికి ఓరల్ సెక్స్ లో పాల్గొంటారని సీడీసీ గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో వీరిలో 2 శాతం మంది మాత్రమే కండోమ్లను ఉపయోగిస్తారు.
 

అందుకే కండోమ్లను తయారు చేయడానికి ఉపయోగించే లేటెక్స్ లోని సువాసన ఓరల్ సెక్స్ ను మరింత ఆహ్లాదకరంగా చేయడమే కాకుండా.. మహిళలకు ఎన్నో లైంగిక వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

ఫ్లేవర్డ్ కండోమ్లు సురక్షితమైన సెక్స్ ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యునైటెడ్ స్టేట్స్  ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కండోమ్ల బలం, భద్రతపై అంగీకరించింది.
 

అయినప్పటికీ.. ఫ్లేవర్డ్ కండోమ్లలో ఉండే చక్కెరకు వ్యతిరేకంగా ఎఫ్డిఎ హెచ్చరిస్తుంది. లేటెక్స్ లో ఉండే ఈ చక్కెర చొచ్చుకుపోయే సెక్స్ సమయంలో మహిళల యోని పీహెచ్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇది మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఫ్లేవర్డ్ కండోమ్లు రసాయనికంగా సంశ్లేషణ చేయబడతాయి. దీని అర్థం మీరు వాటిని ఉపయోగించినప్పుడు మీరు మరికొన్ని రసాయనాలకు గురవుతారు. దీని వల్ల యోని చికాకు, దురద, సంక్రమణ ప్రమాదం కూడా ఉంది.

ఏం చేయాలంటే

ఓరల్ లేదా యోని సెక్స్ లో ఎలాంటి రక్షణ లేకుండా సెక్స్ లో పాల్గొనడం ప్రమాదకరం. అందుకే అవసరమైనప్పుడల్లా కండోమ్స్ ను వాడండి. మీరు ఓరల్ సెక్స్ సమయంలో ఫ్లేవర్డ్ కండోమ్లను ఉపయోగించొచ్చు. కానీ చొచ్చుకుపోయే సెక్స్ సమయంలో సాధారణ కండోమ్ లనే ఉపయోగించాలి. 

click me!