పెళ్లికి ముందు నిశ్చితార్థం పక్కాగా చేసుకుంటారు. మీరు చేసుకునేది ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు ఓకే చేసినా పెళ్లి అయినా సరే.. ఎంగేజ్మెంట్ కు ముందే కొన్ని విషయాలను మీ భాగస్వామిని ఖచ్చితంగా అడగాలి. అవును జీవితాంతం కలిసి ఉండబోయే మీరు మీ భాగస్వామి ఆలోచనలను పక్కాగా తెలుసుకోవాల్సిందే. ఇలా తెలుసుకుంటేనే పెళ్లి తర్వాత మీ లైఫ్ బాగుంటుంది. మరి నిశ్చితార్థానికి ముందు భాగస్వామిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లల గురించి మీ అంచనాలుంటి?
ఫ్యామిలీని స్టార్ట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నలను కూడా భాగస్వామిని ఖచ్చితంగా అడగండి. అంటే మీ కోరికలు, ఆకాంక్షలను చర్చించండి. ముఖ్యంగా మీ ఇద్దరూ ఎంత మంది పిల్లలను కావాలనుకుంటున్నారు? పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు రాకుండా ఉండేందుకు, వారి భవిష్యత్తు గురించి ప్లాన్స్ వంటి విషయాలను చర్చిండి.
గొడవలొస్తే ఏం చేయాలి?
వైవాహిక జీవితంలో గొడవలు రావడం చాలా సహజం. కానీ గొడవల తర్వాత ఎలా ఉంటారనేదే ముఖ్యం. గొడవలొస్తే మీ భాగస్వామి దానికి ఎలా నిర్వహిస్తాడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ కమ్యూనికేషన్ విధానం, మీరు విభేదాలను ఎలా నిర్వహిస్తారు? భవిష్యత్తులో గొడవలు, మనస్పర్థలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలో ముందే డిస్కషన్ చేసుకోండి.
గతం గురించి
మునుపటి సంబంధాలు, వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను ఒకరికొరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. వీటినే పట్టుకుని భాగస్వామిని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఒకరికొకరు వారివారి గతం గురించి అర్థం చేసుకుంటే పెళ్లి తర్వాత లైఫ్ బాగుంటుంది. ఎలాంటి సమస్యలు రావు.
మీ లక్ష్యాలు, ఆకాంక్షలు ఏమిటి?
ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. జీవితంలో ఇవి చేయాలి? అది సాధించాలని. ఇవి నెరవేరాలంటే మాత్రం ఎంగేజ్మెంట్ కు ముందే మీ భాగస్వామికి మీ లక్ష్యాలను గురించి చెప్పాలి. అలాగే మీ భాగస్వామి లక్ష్యాలను కూడా మీరు తెలుసుకోవాలి. ఇద్దరూ అర్థం చేసుకుంటే మీ జీవితంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఎంగేజ్మెంట్ కు ముందే కెరీర్ లక్ష్యాలు, కుటుంబ ప్రణాళికలు,జీవనశైలి ప్రాధాన్యతల గురించి చర్చించండి.
ఇంటి బాధ్యతలు
ఇంట్లో ఒక్కరు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ఇది కాని పని కూడా. అందుకే ఇంటి పనులు, బాధ్యతలకు సంబంధించి మీ అంచనాలను చర్చించండి. ఒకరి ఆకాంక్షలపై మరొకరు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటేనే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. ఇది గొడవలను నివారించడానికి సహాయపడుతుంది.
ఆర్థిక వ్యవహారాలు
వైవాహిక జీవితంలో డబ్బు వల్లే ఎన్నో గొడవలు వస్తాయి. అలాగే ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే డబ్బుకు సంబంధించిన విషయాలను ముందే చర్చిండి. అంటే మీ ఆర్థిక స్తోమత, ఖర్చులు, పొదుపు ఎలా చేయాలి వంటి విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడండి.
మతం, ఆధ్యాత్మికత
మీరు వేర్వేరు మతాలకు చెందిన వారైతే ఈ విషయంలో ముందే క్లారిటీగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు, మీ భాగస్వామికి వేర్వేరు మత లేదా ఆధ్యాత్మిక నమ్మకాలు ఉంటే ఉన్నట్టైతే.. అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చర్చిండి. ఈ విషయంలో ముందే ఒక అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. లేదంటే ఫ్యాచర్ లో ఇద్దరి మధ్య గొడవలు రావొచ్చు.