Relationship: భర్త కన్నా భార్య ఎందుకు చిన్నదై ఉండాలి.. దీని వెనుక రహస్యం ఏమిటి?

Published : Jul 01, 2023, 01:26 PM IST

Relationship: భార్యాభర్తల్లో సాధారణంగా భార్య చిన్నదై ఉంటుంది. దీని వెనుక రహస్యం ఏమైనా ఉందా.. అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూద్దాం.  

PREV
16
Relationship: భర్త కన్నా భార్య ఎందుకు చిన్నదై ఉండాలి.. దీని వెనుక రహస్యం ఏమిటి?

సాధారణంగా మనం చూసే పెళ్లిళ్లలో భార్య వయసు తక్కువ భర్త వయసు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నయమే కానీ పాత రోజుల్లో ఏకంగా చిన్నపిల్లలకి ముసలి వాళ్లకి పెళ్లిళ్లు చేసేసేవారు. అయితే ఇది కేవలం సాంప్రదాయమైన లేక దీని వెనక ఏదైనా ఆరోగ్యపరమైన సాంఘికపరమైన రహస్యం ఉందా..
 

26

 అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. సాధారణంగా పురుషుని కన్నా స్త్రీ వయసు చిన్నగా ఉండటం వలన ముసలి అయిన తరువాత ఆ భార్య ఆ భర్తకి సేవ చేయగలుగుతుంది. ఒకవేళ భార్య పెద్దది అయితే కనుక మగవాళ్లు ఆడవాళ్లు చేసినంత ఓపికగా సేవలు చేయలేరు.
 

36

మరో కారణం ఏమిటంటే ఆడపిల్లలు చిన్న వయసులోనే వయసుకు మించి పెద్దరికంగా ఆలోచించగలరు వ్యవహరించగలరు. కానీ పురుషులు వారి వయసుకు తగినట్లు మాత్రమే ప్రవర్తించగలరు.
 

46

ఇంకొక కారణం ఎక్కువగా ఉంటుంది తనకన్నా పెద్దవాడైనా భర్త చనిపోతే తట్టుకొని నిలబడగలుగుతుంది కానీ  భార్య చనిపోయిన భర్త అంత లౌక్యంగా సంసారాన్ని ఈదలేడు. అదేవిధంగా పురుషుని కన్నా స్త్రీకి సహనం ఎక్కువగా ఉంటుంది భర్త కంటే భార్య వయసులో చిన్నది అయితే ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి.
 

56

ఒకే వయసు వారు లేదంటే వయసులో తనకంటే పెద్దది అయినా మహిళని పెళ్లి చేసుకుంటే ఆలోచనలు కలవకపోవడంతో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫోను శాస్త్రాలు కూడా అమ్మాయి కన్నా అబ్బాయి ఖచ్చితంగా పెద్దవాడై ఉండాలని చెప్తుంది. 
 

66

అయితే ఇప్పుడిప్పుడే ఈ సాంప్రదాయాన్ని  పక్కన పెడుతున్నారు నేటి యువత. వయసుని దృష్టిలో తీసుకోకుండా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు.

click me!

Recommended Stories