Relationship: తరచూ మాజీ ప్రస్తావన.. పరిష్కారమెలా..?

First Published | Jul 30, 2022, 8:07 AM IST

చాలా కొద్ది మంది మాత్రమే ఈ విషయంలో సరిగా అర్థం చేసుకోగలరు. కానీ చాలా మందికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో మాజీ ప్రస్తావన తీసుకువచ్చి.. ఇన్ డైరెక్ట్ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. 

దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు రావడం సహజం. అయితే.. ఈ గొడవలు, మనస్పర్థలు కాస్త ప్రయత్నిస్తే.. వెంటనే సద్దుమణుగుతాయి. అయితే.. అలా కాకుండా.. దంపతుల మధ్య ఒక్కసారి అభద్రతా భావం మొదలైందంటే చాలు.. దాని నుంచి వచ్చే సమస్యలకు అంతు అనేది ఉండదు. అసలు దంపతుల మధ్య ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్  ఎందుకు కలుగుతుంది అంటే... చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో అతి పెద్దగా సమస్య మారేది మాత్రం మాజీల ప్రస్తావన. 

Image: Getty Images


దాదాపు అందరూ ఒకే రిలేషన్ కి స్టిక్ అవ్వకపోవచ్చు.గతంలో వారికి ప్రేమ పరిచయాలు ఉండవచ్చు. అయితే.. ఏవో కారణాలతో విడిపోయి  కొత్త బంధంలోకి అడుగుపెట్టొచ్చు. అయితే... తమ భాగస్వామి జీవితంలో తమకన్నా ముందు మరో వ్యక్తి ఉన్నారు అని తమ ప్రస్తుత పార్ట్ నర్ కి తెలిస్తే.. ఆ బంధం అంత స్టేబుల్ గా ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ విషయంలో సరిగా అర్థం చేసుకోగలరు. కానీ చాలా మందికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో మాజీ ప్రస్తావన తీసుకువచ్చి.. ఇన్ డైరెక్ట్ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి పరిస్థితిలో  ఉన్నారా..? మీ పార్ట్ నర్ ప్రతి నిమిషం మీ మాజీ ప్రస్తావన తీసుకువచ్చి.. ఇబ్బంది పెడుతున్నారా..? మరి ఈ సమస్యకు పరిష్కారమెలా అంటే.. ఈ కింద టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...


Image: Getty Images

1.చాలా మంది జీవితంలో గతంలొ ఒకరిని ప్రేమించి ఆ తర్వాత మరొకరి తో లైఫ్ మొదలుపెట్టవచ్చు. అయితే.. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామికి క్లారిటీ ఇవ్వాలి. తాము గతంలో మరొకరిని ఇష్టపడినప్పటికీ.. ఇప్పుడు ఆ వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదు అనే క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం మీ జీవితంలో మీ భాగస్వామి తప్ప.. మరెవరూ లేరని.. మాజీని పూర్తిగా మర్చిపోయామని వారిని నమ్మించాలి. మీ మాటలు, చేతలు నమ్మసక్యంగా ఉంటే.. వారు మీ మాజీ ల గురించి ప్రస్తావన తీసుకురారు.

Image: Getty Images

2. మీ మనసులో మీ మాజీ ఉన్నారు అనే భావన మీ ప్రస్తత భాగస్వామికి కలిగితే.. మీ మధ్య సమస్యలు రావడం ఖాయం. కానీ... మీరు మీ మాజీ ని ప్రస్తుతం కనీసం తలుచుకోవడం లేదు.. ప్రేమించడం లేదని.. కేవలం మీ భాగస్వామిని మాత్రమే ప్రేమిస్తున్నామనే క్లారిటీ ఇవ్వాలి. వారితో ప్రత్యేకమైన సమయాన్ని గడపాలి. మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి అర్థమయ్యేలా చెబితే.. మాజీల ప్రస్తావన మళ్లీ రాదు.
 

Image: Getty Images

3. చాలా మంది గతంలో ప్రేమించిన వారితో విడిపోయిన తర్వాత కూడా వారితో స్నేహంగా మెలుగుతారు. మీ మనసులో కేవలం స్నేహితులమనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ.. ఆ విషయం మీ భాగస్వామికి తెలియకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి... మీకు మీ మాజీ పై ప్రేమ లేకపోయినా.. వారితో స్నేహం మీ పార్ట్ నర్ ని ఇబ్బంది పెడుతోందని అనిపిస్తూ.. వారికి దూరంగా ఉండటమే మంచిది. వారితో మాట్లాడే సమయాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. లేకపోతే మీ పార్ట్ నర్ కి మీపై అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది.
 

Image: Getty Images

4. ఇక మీ జీవిత భాగస్వామి ఎక్కువగా తమ మాజీ గురించి మాట్లాడటం, ఆలోచించడం లాంటివి చేస్తున్నారని.. మీకు ఆ విషయం బాధ కలిగిస్తుంటే.. అది మీ పార్ట్ నర్ కి తెలిసేలా చేసే బాధ్యత మీదే. ఆ విషయంలో మీ మనసులోని మాటలను మీ పార్ట్ నర్ కి తెలియజేయాలి. వారు మీ సమస్యను అర్థం చేసుకుంటే.. ఈ అభద్రతా భావం నుంచి బయటపడే అవకాశం ఉంది. సమస్యను మీరే స్వయంగా పరిష్కరించుకోవచ్చు.

Image: Getty Images

5.మీ భాగస్వామి మిమ్మల్ని నిందించడం లేదా మీ మాజీ గురించి ప్రస్తావించడం మానేయాలని మీరు ఆశించినట్లయితే, మీ భాగస్వామి హద్దులు దాటకుండా చూసుకోండి. మీ మాజీ గురించి ప్రస్తావించడం మానేయమని వారిని ఖచ్చితంగా అడగండి ఎందుకంటే ఇది మీకు సరైనది కాదు. మీ భాగస్వామి దీన్ని గౌరవించగలగాలి. వారి అభద్రతను తగ్గించగలగాలి.

Image: Getty Images

6.మీ ప్రస్తుత భాగస్వామి ఇప్పటికీ మీ మాజీ గురించి మాట్లాడటం లేదా ఆలోచించడంపై దృష్టి సారిస్తే, వారు సంబంధంలో పెట్టుబడి పెట్టలేదని లేదా వారు మిమ్మల్ని పూర్తిగా నమ్మడం లేదు అనే అర్థం. నిజానికి దంపతుల మధ్య బంధం బాగుండాలంటే వారి మధ్య ఉండాల్సింది నమ్మకమే. కాబట్టి.. ముందు నమ్మకం పెంచుకోవాలి. లేకుంటే ప్రస్తుత భాగస్వామి కూడా మళ్లీ మాజీగా మారే అవకాశం ఉంది.

Latest Videos

click me!