Relationship:అలాంటి రిలేషన్ లో తప్పులు జరగకుండా ఉండాలంటే..!

First Published | Jul 29, 2022, 11:58 AM IST

ఇద్దరూ తమ ఉద్దేశాలను తెలియజేసుకున్న తర్వాతే.. ఈ రిలేషన్ ని ప్రారంభించాలట. ముఖ్యంగా సెక్స్ రిలేషన్ ప్రారంభించిన తర్వాత.. ఒకరిపై మరొకరికి ఫీలింగ్స్ కలిగే అవకాశం ఉంది.

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఈ పదం విన్నారా..? ఇద్దరు వ్యక్తులు స్నేహితుల్లానే ఉంటారు. కానీ.. వారు నిజంగా రిలేషన్ లో ఉన్నవారు ఎలా అయితే ఉంటారో అలా ఉంటారు అన్నమాట. ఎవరైనా వారిని చూస్తే.. నిజంగా ప్రేమలోనో.. లేదా రిలేషన్ లోనే ఉన్నట్లే ఉంటారు. ఫిజికల్ రిలేషన్ సైతం వారికి ఉంటుంది. కానీ... చివరకు పెళ్లి లాంటివి మాత్రం చేసుకోరు. కేవలం స్నేహితుల్లానే ఉంటారు. సెక్స్ రిలేషన్ లో ఉండి మరీ.. కేవలం ఫ్రెండ్స్ లా మాత్రమే వీరు ఉంటారు. అయితే.. ఈ రిలేషన్ లో ఉన్నప్పుడు చాలా మంది తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారట. అవేంటో ఓసారి చూద్దాం...
 

ఈ రిలేషన్ లో ఉన్నవారు.. కచ్చితంగా నిజాయితీగా ఉండాలట. మీరు ఆ రిలేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారు. తర్వాత.. ఎలాంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి..? ఇలా ప్రతి విషయాన్ని ముందుగానే మాబట్లాడుకోవాలట. ఇద్దరూ తమ ఉద్దేశాలను తెలియజేసుకున్న తర్వాతే.. ఈ రిలేషన్ ని ప్రారంభించాలట. ముఖ్యంగా సెక్స్ రిలేషన్ ప్రారంభించిన తర్వాత.. ఒకరిపై మరొకరికి ఫీలింగ్స్ కలిగే అవకాశం ఉంది. అయితే.. ఇద్దరికీ కలిగితే అది వేరు. అలా కాకుండా కేవలం ఒకరికే కలిగితే.. భవిష్యత్తులో సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే.. ముందుగా ఈ విషయంలో నిజాయితీగా ఉండాలి. 
 


అయితే.. నిజానికి ఈ రిలేషన్ లో ఉండటం అంత ఈజీ కాదట. ఎందుకంటే.. సెక్స్ బెనిఫిట్స్ తో.. స్నేహితులుగా ఉండటం అంత సులభమేమీ కాదట. వీరు రిలేషన్ లో ఉన్నవారిలా కూడా ప్రవర్తించకూడదు. అంటే... డాక్టర్ ని కలవడానికి వెళ్లడం, బంధువులను కలవడం లాంటివి చేయకూడదట. రిలేషన్ లో ఉన్నవారిలా పొరపాటున కూడా ప్రవర్తించకూడదు.
 

బెనిఫిట్‌ల అమరికతో ఉన్న స్నేహితుల్లో నంబర్ వన్ రూల్ అటాచ్ చేసుకోకూడదు. వారు మీరు స్నేహితులు, వారి పట్ల భావాలను కలిగి ఉండటానికి మీకు అనుమతి ఉంది- కానీ మీరు సాధారణంగా మీ ఇతర స్నేహితుల పట్ల కలిగి ఉండే భావాలు మాత్రమే. మీరు మీ భాగస్వామి పట్ల భావాలను కలిగి ఉన్నారని మీరు కనుగొంటే, ఒక అడుగు వెనక్కి వేసి, మీ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి.
 

మీరు మీ స్నేహితుడితో సెక్స్ రిలేషన్ పెట్టుకున్నంత మాత్రాన.. మీకు అవసరమైన ప్రతిసారీ వారు మీకు అందుబాటులో ఉంటారని మీరు ఆశించడం కరెక్ట్ కాదు. ఎక్కువ ఆశిస్తే.. మీరు భంగపడే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!