మీ మధ్య ఇవి ఉంటే చాలు మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు..

First Published | Sep 23, 2023, 10:37 AM IST

పెళ్లి చేసుకోవడం సులువే.. కానీ ఈ బంధం కలకాలం ఉండాలంటే మాత్రం ఎంతో కష్టపడాలి. కష్టమంటే అదేదో అనుకునేరు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కలిసి పనులు చూసుకుంటూ, గొడవలను పరిష్కరించుకుంటే మీ బంధం సక్సెస్ అయినట్టే. ఇలాంటి వారిని ఎవరూ, ఎలాంటి పరిస్థితులు విడదీయలేవు.
 

రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కానీ దీన్ని మెయింటైన్ చేయడం మాత్రం కష్టమన్న సంగతి తర్వాత తెలుసుకుంటారు. చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత.. పెళ్లి అనవసరంగా చేసుకున్న అని ఫీలైపోతుంటారు. ఎందుకంటే వీళ్లకు ఆ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేయడానికి రాదు కాబట్టి. వైవాహిక జీవితాన్ని ముందుకు సజావుగా ముందుకు నడిపించడం అంత కష్టమైన పనేం కాదు. భార్యభర్తల మధ్య కొన్ని ఉంటే వీరిని ఎలాంటి పరిస్థితులైనా.. ఎలాంటి వ్యక్తులైనా అస్సలు విడదీయరంటున్నారు నిపుణులు. రిలేషన్ షిప్ సాఫీగా సాగడానికి భార్యాభర్తల మధ్యన ఎలాంటివి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సరైన కమ్యూనికేషన్

ఎలాంటి రిలేషన్ షిప్ అయినా సరే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. మీ సంబంధంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే మీరు మీ భావాలను మీ భాగస్వామికి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తారు. మీ ప్రతి పనిగురించి చెప్తారు. ఇలాంటి వారి మధ్య అపార్థాలక చోటు ఉండదు. వీరి బంధం బలంగా ఉంటుంది. ఇలాంటి సంబంధాలు కలకాలం కొనసాగుతాయి. 
 


ఒకరికొకరు ప్రాధాన్యతనివ్వడం

ఎలాంటి బంధమైనా ఒకరికొకరు తోడుగా ఉండటంతో పాటుగా ప్రాధాన్యతను ఇవ్వాలి. రిలేషన్ షిప్ లో భాగస్వాములిద్దరూ ఒకరికొకరు ప్రాధాన్యతనిచ్చుకుంటూ ప్రతి పనిలో తోడుగా ఉండాలి. ఇలాంటి బంధంలో ఎలాంటి గొడవలు రావు. లవ్ లైఫ్ వివాహం వరకు వెళ్లుతుంది. ప్రాధాన్యత కరువైతే ఆ రిలేషన్ షిప్ మధ్యలోనే బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని అనిపిస్తే వారు మీతో ఉండటం కష్టం మరి.

ఒకరిపై ఒకరికి గౌరవం

రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకరినొకరు ఎలా గౌరవించాలో తెలిస్తే వారి సంబంధం ఎక్కువ కాలం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని చెప్తూ వారిని ప్రోత్సహిస్తే ఇలాంటి బంధం బలంగా ఉంటుంది. అలాగే భాగస్వాములిద్దరూ ప్రతి సందర్భంలో ఒకరికొకరు అండగా నిలబడితే వారి బంధంలో ఎలాంటి అపార్థాలకు చోటు ఉండదు. 

నమ్మకం

ఏ బంధానికైనా నమ్మకమే పునాది. నమ్మకం పోతే ఆ బంధాలు విడిపోయినట్టే. ఇదే బ్రేకప్ కు ప్రధాన కారణం. రిలేషన్ షిప్ లో భాగస్వాములిద్దరికీ ఒకరి గురించి మరొకరికి అభద్రతా భావం లేనప్పుడు.. ఆ ఇద్దరూ ఒకరినొకరు బాగా నమ్మినప్పుడు వారి రిలేషన్ షిప్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇది పెళ్లి వరకు వెళుతుంది. 
 

ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండటం

ఒకరితో ఒకరు నిజాయితీగా ఉంటే మీ బంధం బలంగా ఉంటుంది. అలాగే మీ సంబంధం విషయంలో మీరు స్ఫష్టంగా ఉంటే.. మీ సంబంధం దీర్ఘకాలికంగా ఉంటుంది. ఒకరితో ఒకరు ఉండాలనుకునే ఇద్దరు వ్యక్తులు వారి సంబంధం నుంచి వారి ప్రతి ఆలోచనను పంచుకుంటారు. ఇదే వారిని పెళ్లి వరకు తీసుకెళుతుంది.

కుటుంబ సభ్యులను 

భాగస్వాములతో పాటుగా వారి కుటుంబ సభ్యులుకూడా ఈ సంబంధంలో పాల్గొంటే ఈ బంధం కలకాలం కొనసాగే అవకాశం ఉంది. భాగస్వాములిద్దరి కుటుంబాలు ఒకరినొకరు తెలుసుకుని వారి సంబంధాన్ని అంగీకరిస్తే.. మీ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. 

Latest Videos

click me!