సెక్స్ రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు.. ఇది ఇరువురికి ఎంతో మేలు చేస్తుంది. సెక్స్ స్త్రీ పురుషులిద్దరికీ ఆనందాన్నికలిగిస్తుంది. హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ తగ్గుతుంది. అలాగే ఆడవారిలో మూత్రాశయంలో బలం పెరుగుతుంది. సెక్స్ స్త్రీ పురుషులిద్దరికీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఫిట్ గా ఉంచుతుంది. అలాగే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాదు గుండెపోటుకు కారణమయ్యే అధిక రక్తపోటును కూడా సెక్స్ నియంత్రిస్తుంది. సెక్స్ లో పా్లగొన్న తర్వాత భాగస్వాములిద్దరూ కంటి నిండా, ప్రశాంతంగా పడుకుంటారు. అంతేకాదు ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. మీకు తెలుసా సెక్స్ లో పాల్గొనడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
రోజుకు సెక్స్ లో పాల్గొంటే?
సెక్స్ మీ శారీరక అవసరాలను తీర్చడమే కాకుండా.. భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఫ్యాక్టర్ పురుషుల కంటే మహిళలకు చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. సెక్స్ ఇందుకు సహాయపడుతుంది.
సెక్స్ వల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. వారానికి ఒకటి లేదా రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనడం మంచిది.
ఎందుకంటే సెక్స్ లో పాల్గొనే ఇద్దరు వ్యక్తులకు ఒకే సమయంలో లేదా భాగస్వామి మాదిరిగానే సెక్స్ లో పాల్గొనాలని అనుకోరు. ఒక భాగస్వామికి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాని వేరే భాగస్వామికి ఉండాలన్న రూల్ లేదు. వారికి ఇష్టం లేకున్న సెక్స్ లో పాల్గొంటే మీరు వారిని బలవంతం పెట్టినట్టే అవుతుంది. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం.. తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల విపరీతమైన శారీరక అలసట ఉంటుంది. అలాగే దీనివల్ల పురుషులతో పాటుగా మహిళల జననేంద్రియాలలో చికాకు కలుగుతుంది. అందుకే రెండు శరీరాలు కలిసినప్పుడు రెండు మనసులు కూడా దానికి అనుగుణంగా ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శారీరక సంబంధం కూడా అవసరమైన మేరకు మాత్రమే ఉండాలి.