మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా భయాలు ఉంటే, మీరు ఖచ్చితంగా వాటి గురించి మీ భాగస్వామికి చెప్పాలి. ఉదాహరణకు, మీకు దీర్ఘకాలిక అనారోగ్యం, అలెర్జీలు లేదా మరేదైనా భయాలు ఉంటే, మీరు వాటిని మీ భాగస్వామి నుండి దాచకూడదు. మీ భాగస్వామి మీ గురించి తెలిస్తే, వారు మిమ్మల్ని సరిగ్గా చూసుకోగలరు, ఇది మీకు కూడా సహాయపడుతుంది.
జీవితంలో ఎదురయ్యే సమస్యలు
భార్యభర్తలు జీవితాంతం భాగస్వాములు, కలిసి ఉండటానికి జీవిత ప్రయాణం మొదలుపెడతారు. కాబట్టి, మీరిద్దరూ మీ చింతలు, ఒత్తిళ్లను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఇది మీరు మరింత రిలాక్స్‌గా ఉండటానికి , మీ భాగస్వామి మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.