లవ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఏ రాశివారు ఏం చేయాలో తెలుసా...?

First Published | May 18, 2022, 1:40 PM IST

ఎవరైనా సరే.. వారి రిలేషన్ బాగుండాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అంతకంటే ముందుగా.. కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. ఆ విషయాలను జోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకోవచ్చట. 

Relationship tips

ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ లైఫ్ కచ్చితంగా ఉంటుంది. కొందరు ఆల్రెడీ రిలేషన్ లో ఉంటే.. మరి కొందరు.. రిలేషన్ లోకి అడుగుపెట్టడానికి రెడీగా ఉండి ఉండొచ్చు. ఎవరైనా సరే.. వారి రిలేషన్ బాగుండాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అంతకంటే ముందుగా.. కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. ఆ విషయాలను జోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకోవచ్చట. ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. వారి ప్రేమ జీవితం సాఫీగా సాగుతుందో ఓసారి చూసేద్దామా..

1.మేష రాశి..
ఈ రాశివారికి రిలేషన్ షిప్ లో కి చాలా సులభంగా వెళతారు. కానీ.. వారి పార్ట్ నర్ తో గొడవ జరిగినప్పుడు అంత సులభంగా గెలవలేరు. మీదే పై చేయి ఉండాలి అంటే మాత్రం చాలా కష్టం. చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే.. తర్వాత మీరే బాధపడతారు.


2.వృషభ రాశి..
ఈ రాశివారికి కాస్త స్వతంత్రంగా.. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. అయితే.. రిలేషన్ లోకి అడుగుపెట్టాక ఇది సాధ్యం కాకపోవచ్చు. మీ స్పేస్ మీకు కావాలి అనుకుంటే.. మీరే స్వయంగా.. మీ పార్ట్ నర్ ని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. మీకు కావాల్సిన స్పేస్ ని వారి నుంచి అడిగి తీసుకోవచ్చు.

3.మిథున రాశి..
రిలేషన్ లోకి అడుగుపెట్టాం కదా అని.. వారి కోసం మీరు పూర్తిగా మారిపోవాల్సిన అవసరం లేదు. వారికి విలువ ఇస్తూనే.. మీకంటూ ఒక విలువ ఉండేలా చూసుకోవాలి. మీ ఆసక్తులను చంపేసుకోవాల్సిన అవసరం లేదు.


4.కర్కాటక రాశి..
ఈ రాశివారు తమ రిలేషన్ సరిగా ఉండాలి అంటే.. తమ పార్ట్ నర్ పై నమ్మకం ఎక్కువగా ఉంచాలి. అలా నమ్మకం ఉంచినప్పుడే వీరి బంధం బాగుంటుంది.

5.సింహ రాశి..
ఈ రాశివారు ఎంత మందిలో ఉన్నా.. ఎక్కువగా గుర్తింపు పొందుతూ ఉంటారు. అయితే...  మీరు మీ పార్ట్ నర్ ని కూడా గుర్తింపు పొందేలా చేయాలి. వారికంటూ కొంత అవకాశం ఇవ్వాలి. మీరు ఒంటరి కాదు అనే విషయాన్ని గుర్తించుకోవాలి.

6.కన్య రాశి..
ఈ రాశివారు తమ పార్ట్ నర్ పట్ల కాస్త దయగా ఉండటం నేర్చుకోవాలి.  మరీ ఎక్కువ హార్డ్ గా ఉండటం మంచిది కాదు.. ప్రేమగా ఉంటేనే వీరి బంధం బలంగా ఉంటుంది.

7.తుల రాశి..
ఈ రాశివారు తమ ఆధిపత్యం చూపించడం తో పాటు.. పార్ట్ నర్ అవసరాలను కూడా గుర్తించాలి.  ఓ మంచి పార్ట్ నర్ మాత్రమే.. తమ భాగస్వామిని పూర్తిగా గౌరవిస్తాడు అనే విషయం గుర్తుంచుకోవాలి.

8.వృశ్చిక రాశి..
జీవిత భాగస్వాములకు ఒకరిపై మరొకరికి గ్రడ్జ్ ఉండకూడదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. కొట్టుకోవడం లాంటివి ఆపేస్తే.. వీరి లైఫ్ బాగుంటుంది.

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చెప్పాలి అనుకున్న విషయాన్ని ఎంత స్వీట్ గా చెబితే అంత మంచిది. అలా కాకుడా.. కొట్టినట్లు, తిట్టినట్లు మాట్లాడితే.. వారి బంధం ఎక్కువగా కాలం నిలపడదనే చెప్పాలి.

10.మకర రాశి..
ఈ రాశివారికి పని మీద ఉన్న దృష్టి.. కుటుంబం మీద ఎక్కువగా ఉండదు. కాబట్టి.. వీరు పని మీద దృష్టిని... ఫ్యామిలీ వైపు కూడా పెట్టాలి. అప్పుడు వారి లైఫ్ బాగుంటుంది.


11.కుంభ రాశి..
ఈ రాశివారు ఎంత కామ్ గా ఉంటే...  మీ మ్యారేజ్ లైఫ్ అంత బాగుంటుంది. మీకు ఏదైనా విషయం తెలిస్తే.. దానిని ఎదుటివారికి చెప్పేంత వరకు వీరికి నిద్ర పట్టదు. అయితే.. దానిని మానుకొని.. కాస్త నోరు కంట్రోల్ చేసుకుంటే.. వీరి లైఫ్ బాగుంటుంది.

12.మీన రాశి..
ఈ రాశివారికి ఏది మొదలు పెట్టాలి అన్నా.. వెనక నుంచి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. అలాంటి పుషప్ తగ్గించుకొని.. కాస్త తొందరగా ఉంటే మంచిది. 

Latest Videos

click me!