Prepose Day 2022: వాలెంటైన్ వీక్ రెండో రోజు.. మీ ప్రియమైన వ్యక్తికి ఇలా ప్రపోజ్ చెయ్యండి!

First Published | Feb 8, 2022, 9:23 AM IST

Prepose Day 2022: ఈరోజు ప్రపోజ్ డే.. వాలెంటైన్స్ వీక్ లో రెండో రోజు ఈరోజు. వాలెంటైన్స్ డే కి వారం ముందు మొదటి రోజు రోజ్ డే కాగా రెండో రోజు ప్రపోజ్ డే.. ఈరోజు ప్రేమికులు ఎలా జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం...
 

వివరాల్లోకి వెళ్తే... ఎంతో కాలంగా ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చెయ్యాలి అని ఉన్న... మనసులో ప్రేమను ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి సరైన సమయం ఈరోజు.  మీ మనసులోని భావాలను మీకు నచ్చిన వ్యక్తికీ మీరు ఎలా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారుఅనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. నీ ప్రియమైన వ్యక్తికి ఇలా ప్రపోజ్ చేసి చూడండి..
 

ప్రేమంటే నువ్వున్నప్పుడు నన్ను నేను..  నువ్వులేనప్పుడు ఈ లోకాన్ని మరిచిపోవడం ప్రేమంటే  నీ ఆరాధనలో నిలువెల్ల తడవడం నీ బాటలో మునిగితేలడం ప్రేమంటే 
నా మౌనానికి మాటలు నేర్పడం నా మనస్సుకి వెన్నెల పంచడం ప్రేమంటే ఈ ఊహలకి రెక్కలు తొడగడం నా కలానికి కవితలు నేర్పడం...Happy prepose Day..
 


నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి..
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి..
నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి..
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి..
నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి..
నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి..
నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి..
Happy prepose Day..

నీవే నా ధైర్యం - నా జీవనసమరానికి తోడుగా ఉన్నావు. నీవే ఓ నిజం - తీపి అబద్ధాన్ని చీల్చేస్తావు నీవే ఓ అగ్ని - అన్యాయం పై నిప్పులు చెరుగుతావు నీవే ఓ సముద్రం - బడబాగ్నులను దాచుకుంటావు నీవే ఓ మేఘం - అనురాగాల్ని నిండుగా వర్షిస్తావు
నీవే ఓ త్యాగం స్వార్థాన్ని దూరంగా తరిమేస్తావు
ఓ నేస్తం నీవే నా సర్వం - లేదంటే ఆగిపోవును నా ప్రాణం..
Happy Prepose Day
 

హృదయ లోగిలిలో విరిసిన యవ్వనమా... కనుపాపలో మెరిసిన నక్షత్రమా... నా కనులలో దాగిన స్వప్నమా... నింగి విడిచి నన్ను చేరిన అందమా...
దివి నుండి దిగి వచ్చిన నా ప్రియతమా... ప్రతిరోజూ నీ నవ్వే నాకు సరిగమ..
Happy Prepose Day

ప్రియతమా!!!
నా ప్రాణం నీకు మాత్రమే అంకింతం కావాలని... నా మౌనం నీకు మాత్రమే మాటలు నేర్పాలని... నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలని... నిన్ను చేరాలని నా తపన...
Happy Prepose Day
 

నీపరిచయమే ఒక విచిత్రం!
నీమాటే ఒక మంత్రం!
నీచూపే ఒక మాయ!
నీరూపే ఒక కల!
నా కలలో..
నిన్ను చూస్తే .. సంతోషం ఆ వెంటనే ఆనందం!
నిన్ను చూస్తె .. ధైర్యం ఆ వెంటనే జీవితం పై ఆశ!
నిన్ను చూడలేకపోతే.. బాధ .. తీయని బాధ ! నువ్వు లేవంటే.. ఆవెధన .. అంతులేని ఆవేధన!
ఆనందం పంచుతావా.. అంతులేని ఆవేధన మిగులుతావా?
Happy Prepose Day

Latest Videos

click me!