పెళ్లి బంధంలో అబద్దాలు చెబితే.. తర్వాత పరిణామాలు ఇలానే ఉంటాయి..!

First Published | Feb 5, 2022, 9:44 AM IST

అవి బంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అసలు అబద్దాలు చెప్పడం వల్ల దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయో ఓసారి చూద్దాం..

మనలో చాలా మంది అబద్దాలు చెబుతుంటారు. పరిస్థితులను బట్టో.. అవసరాన్ని బట్టో.. అబద్దాలు చెప్పి బతికేస్తూ ఉంటారు. అయితే.. ఆ అబద్దాలు.. ఎప్పుడూ మనకు మంచి చేయవు అనే విషయాన్ని గుర్తించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. వైవాహిక జీవితంలో.. తమ పార్ట్ నర్ కి మాత్రం అస్సలు అబద్దం చెప్పకూడదని వారు చెబుతున్నారు.

అబద్దం చిన్నదైనా, పెద్దదైనా... అవి దంపతుల మధ్య నమ్మకం, అవగాహన, విశ్వసాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అవి బంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అసలు అబద్దాలు చెప్పడం వల్ల దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయో ఓసారి చూద్దాం..
 

Latest Videos


couple fight

అబద్దం చెప్పడం వల్ల అప్పటికప్పుడు మీకు సమస్య పరిష్కారమైనట్లు అనిపించినా.. అది శాశ్వతం కాదు. అబద్దాలు ఎప్పుడూ ఎవరికీ మంచి చేయవు. ముఖ్యంగా  దంపతుల మధ్య అబద్దాలు సమస్యలు తీసుకువస్తాయి.  అబద్దం, చిన్నాదా.. పెద్దదా అని పక్కన పెడితే.. దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చేస్తాయి. ఒకరిపై మకొరరికి నమ్మకం పోతుంది.

మీ భాగస్వామికి మీరు మళ్లీ అబద్ధాలు చెబుతారనే భయంతో వారు జీవిస్తారు. మీరు ఏదైనా చెబితే అది నిజమో, అబద్దమో వారు తేల్చుకోలేరు. మీరు అబద్ధం చెప్పిన తర్వాత, మీ భాగస్వామి మీరు చెప్పే ప్రతిదానిని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. వారు మీ మాటలు , చర్యలను తరచుగా అనుమానించడం ప్రారంభిస్తారు.

మీరు ఎక్కువగా అబద్దాలు చెప్పడం వల్ల.. మీ పట్ల వారికి అనుమానం పెరుగుతుంది. మీరు వారిని ప్రేమించడం లేదేమో అనే భావన ఎక్కువగా  పెరిగిపోతుంది.

మీరు వివాహంలో అబద్ధం చెప్పినప్పుడు, మీరు మీ భాగస్వామిని తగినంతగా గౌరవించడం లేదనే భావన కలుగుతుంది.. గౌరవం లేకపోవడం వివాహంలో తీవ్రమైన సమస్యను కలిగిస్తుంది, గౌరవమే.. పెళ్లి బంధానికి అసలైన పునాది అనే విషయాన్ని గుర్తించుకోవాలి.

అబద్ధాలు వివాహాన్ని నింపినప్పుడు, ఇద్దరు భాగస్వాములకు సమతుల్యతను కాపాడుకోవడం కష్టమవుతుంది. సంబంధంలో సంతులనం అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలను అలాగే ఉంచుకుంటూ ఒకరినొకరు విశ్వసించడం , అర్థం చేసుకోవడం చాలా అవసరం.

అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి, మీరు ఇంకా  ఇంకా చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది. అబద్దాలు రోజు రోజుకీ పెరిగిపోతాయి. పూర్తిగా అబద్దాలు మాత్రమే చెప్పడం మొదలుపెడతారు.

click me!