వాలంటైన్ వీక్.. ఏ రోజున ఏ గిఫ్ట్ ఇవ్వాలి..?

First Published | Feb 7, 2022, 1:16 PM IST

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు.. రోజుకో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు.. ఈ వారం రోజులు.. ఆయా స్పెషల్ డేస్ ని స్పెషల్ బహుమతులు ఇచ్చుకుంటారు. మరి ఏ రోజున ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఓసారి తెలుసుకుందామా.

వాలంటైన్స్ డే.. దీనినే ప్రేమికుల రోజు అని కూడా పిలుస్తారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రేమికుల రోజుని జరుపుకుంటారు. అయితే.. దీనిని వారం రోజుల నుంచే జరుుకుంటారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు.. రోజుకో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు.. ఈ వారం రోజులు.. ఆయా స్పెషల్ డేస్ ని స్పెషల్ బహుమతులు ఇచ్చుకుంటారు. మరి ఏ రోజున ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఓసారి తెలుసుకుందామా.

Image: Getty Images

1.ఫిబ్రవరి 7 రోజ్ డే..
ఫిబ్రవరి 7 అంటే.. ఈ రోజు రోజ్ డే. ఈ రోజున మీ లవర్, జీవిత భాగస్వామికి రెడ్ రోజ్ లు గిఫ్ట్ గా ఇవ్వాలి.  ఇలా ఇవ్వడం వల్ల.. ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగే అవకాశం ఉంటుందట. ఎర్ర గులాబి ప్రేమకు చిహ్నం.


2.ఫిబ్రవరి 8  ప్రపోజ్ డే..

ఈ ప్రేమికుల దినోత్సవం రోజున మీ లవర్ తో ఆనందంగా గడపాలి అంటే.. మీరు వారికి ముందే ప్రపోజ్ చేయాలి. అంటే.. ఫిబ్రవరి 8వ తేదీన.. మీరు మీ పార్ట్ నర్ కి ప్రపోజ్ చేయవచ్చు. మీ జీవితంలోని ప్రత్యేక వ్యక్తికి.. వారిపై మీకున్న ఫీలింగ్స్ ని ఈ రోజున తెలియజేయాలి.
 

3.ఫిబ్రవరి 9 చాక్లెట్ డే..
ప్రపంచంలోని అత్యంత మధురమైన బహుమతి ఏది అంటే చాక్లెట్. ఈ చాక్లెట్ ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునే రోజే చాక్లెట్ డే.  ఈ ఫిబ్రవరి 9వ తేదీన.. మీకు నచ్చిన వారికి చాక్లెట్ ని బహుమతిగా ఇవ్వొచ్చు.

4.టెడ్డీ డే..

దాదాపు టెడ్డీ బేర్ ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సాఫ్ట్.. ముద్దుగా, బొద్దుగా ఉండే.. టెడ్డీలని ఫిబ్రవరి 10 వ తేదీన మీరు ప్రేమించేవారికి బహుమతిగా ఇవ్వొచ్చు. ఆ రోజుని టెడ్డీ డే అని పిలుస్తారు.

5.ప్రామిస్ డే..

ఫిబ్రవరి 11వ తేదీన ప్రామిస్ డే ని జరుపుకుంటారు.  ఈ రోజున.. మీరు మీ పార్ట్ నర్ కి అర్థవంతమైన ప్రామిస్ ని చేయాలట. వారు అడిగిన ప్రామిస్ చేసి.. మీకు వారిపై ఉన్న ప్రేమను తెలియజేయండి.

6.హగ్ డే..

ఫిబ్రవరి 12వ తేదీన హగ్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. వారికి మీరు టైట్ హగ్ ఇచ్చి.. మీకు వారిపై ఉన్న ప్రేమ, పీలింగ్స్ ని తెలియజేయాలి.
 

7.కిస్ డే..

ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే జరుపుకుంటారు.  ఈ రోజున మీరు మీ పార్ట్ నర్ కి స్వచ్ఛంగా, ఇష్టంగా, ప్రేమతో కిస్ ఇవ్వాలి. ఈ ముద్దుతో.. వారిపై మీకున్న ప్రేమను తెలియజేయవచ్చు.

8.ప్రేమికుల రోజు..
ఇక చివరగా.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. అంటే ప్రేమికుల రోజు. ఈరోజున మరింత ప్రేమగా. ఆనందంగా ఈ రోజును జరుపుకుంటారు.

Latest Videos

click me!