Relationship: పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే.. దయచేసి వాళ్ల ముందు ఈ పనులు చేయవద్దు?

First Published | Aug 17, 2023, 4:46 PM IST

Relationship: కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తమ ఎదురుగా ఉన్నారని స్పృహ లేకుండా వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే దాని ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద పడుతుందని ఏమాత్రం గ్రహించరు. పిల్లలు భవిష్యత్తు బాగోవాలని కోరుకునే తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ప్రవర్తించ కూడదో ఇక్కడ చూద్దాం.
 

నిజానికి పిల్లలు ఒక అచ్చు వేయబడిన మట్టి లాంటివారు తల్లిదండ్రులుగా మనం ఎలా తయారు చేస్తే వాళ్ళు అలా తయారవుతారు. మన పెంపకం యొక్క ప్రభావమే వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులుగా పిల్లల ముందు మనం బాధ్యతగా మెలగటం అలవాటు చేసుకోవాలి.
 

బాధ్యతగల తల్లిదండ్రులుగా పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకండి. ఆవేశంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతూ పక్కన పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతారు. మనం చేసేది మంచి పనైనా చెడ్డ పని అయినా పిల్లలు మన నుంచి నేర్చుకుంటారని  గుర్తుపెట్టుకోండి.
 


గొడవ పడవలసిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ పిల్లలు లేకుండా చూసుకోండి. అలాగే పిల్లలు ఎదురుగుండా మీ భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడకండి. భాగస్వామికి మీరు విలువ ఇవ్వకపోవడం పక్కనపడితే రేపటి రోజున మీ పిల్లలు కూడా మీ భాగస్వామితో పాటు మీకు కూడా విలువ ఇవ్వడం మానేస్తారు.

వారి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెడితే అది వారి భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారుతుంది. అలాగే పిల్లలు పక్కనే ఉండగా అసలు శృంగారం జోలికి వెళ్ళకండి. పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. పిల్లలకు ఉండే గ్రహణ శక్తి పెద్దలకి కూడా ఉండదని గ్రహించండి.
 

అలాగే వారు చూస్తుండగా అబద్ధం చెప్పటం గాని దొంగతనం చేయడం గాని  చేయకండి. రేపటి రోజున వాళ్లు కూడా ఆ పని చేయటానికి మీరే ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది.
 

కాబట్టి పిల్లలని పక్కన కూర్చోబెట్టుకొని భవిష్యత్తుకి అవసరమైన బంగారు బాటలు వేయటానికి ప్రయత్నించండి ఎప్పుడు వారి ముందు నెగిటివ్  వాతావరణం ఉండకుండా చూసుకోండి. అప్పుడు పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది.

Latest Videos

click me!