ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టైం డేటింగ్ విషయానికి కూడా వర్తిస్తుంది. అయితే కొంతమంది అబ్బాయిలు ఫస్ట్ డేటింగ్ లో ఇలా ఉండాలి? అలా ఉండాలని కలలుకంటుంటారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కుడ లేని ఒత్తిడిక గురవుతుంటారు. కొంతమంది పాత విషయాలను కూడా చెప్తుంటారు. అయితే మొదటిసారి డేటింగ్ కు వెళ్లినప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకు కొన్ని విషయాలను అస్సలే చెప్పకూడదు. ఎందుకంటే ఇవి అబ్బాయిలపై చెడు అభిప్రాయాన్ని లేదా నెగిటీవ్ అభిప్రాయాన్నికలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ "మాజీ" గురించి మాట్లాడొద్దు
ఫస్ట్ డేటింగ్ లో మీ గత సంబంధాల గురించి మాట్లాడటం అస్సలు మంచిది కాదు. మీ మాజీ గురించి మాట్లాడటం వారికి నచ్చకపోవచ్చు. వారితో మీ బంధం సరిగ్గా ఉన్నా.. లేకున్నా ఎట్టి పరిస్థితిలో మీ మాజీ గురించి మాత్రం మాట్లాడకండి.
మీ ఫోన్ ను ఎప్పుడూ చెక్ చేయొచ్చు
చాలా మంది ప్రతి 5 నిమిషాలకోసారి ఫోన్ ను చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. మీరు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లినప్పుడు.. మీ సమయాన్ని వారికే కేటాయించండి. ఒకరిగురించి ఒకరు తెలుసుకోవడానిక ప్రయత్నించండి. ఇలా కాకుండా మీరు మీ ఫోన్ ను ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటే అమర్యాదగా, చాలా చిరాకుగా ఉంటుంది.
సిబ్బందితో దురుసుగా ప్రవర్తించొద్దు
అమ్మాయిలు మిమ్మల్ని మంచి వారని అనిపించుకోవడానికి మీరు రెస్టారెంట్ సిబ్బందితో దురుసుగా మాట్లాడటం, అతిగా మాట్లాడే సాహసం చేయకండి. ఎందుకంటే ఆడవారికి ఇలాంటి నచ్చవు. అంతేకాదు ఇది మీపై చెడు అభిప్రాయాన్ని కూడా కలిగిస్తుంది. మీ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పే ఛాన్స్ కూడా ఉంది.
ఎక్కువగా ప్రమాణం వద్దు
మీరు డేటింగ్ కు వెళ్లే వ్యక్తి మీ స్కూల్ ఫ్రెండ్ లేదా.. కాలేజ్ ఫ్రెండ్ కావొచ్చు. తెలిసిన వ్యక్తితో జర్నీ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు అనుకున్నట్టు ఏదీ ఉండదు. అందుకే లాంగ్ జర్నీకి వెళ్లకండి. ముఖ్యంగా వారికి చెప్పకుండా ఎటూ ప్లాన్ చేయకండి.
ఆలస్యంగా రావద్దు
ఫస్ట్ టైం డేటింగ్ కు వెళ్లేటప్పుడు మీరు లేట్ గా అసలే వెళ్లకూడదు. మీరు వెళ్లాలనుకున్న తేదీని వారికి చెప్పండి. ఒక తేదీ చెప్పి ఇంకో తేదీకి వాయిదా వేయకండి. అలాగే ఆమెను మీరే తీసుకెళతారా? లేదా ఆమెనే వస్తుందా ఖచ్చితంగా తెలుసుకోండి. లేదంటే మీద వారికి చెడు అభిప్రాయం వస్తుంది.
జీతం గురించి మాట్లాడకండి
మీరు మీ మొదటి డేటింగ్ లో జీతం గురించి అస్సలు మాట్లాడకండి. అలాగే మీ సంభాషణల్లో గొప్పలు చెప్పుకోవడం లేదా మీ జీతం గురించి ఫిర్యాదు చేయడం అస్సలు పద్దతి కాదు. అలాగే వారి జీతం గురించి లేనిపోనివి చెప్పకండి. ఇవి ఫస్ట్ ఇంప్రెషన్ ను కలిగించవు.