భార్యాభర్తల బంధం నిండు నూరేళ్లు సవ్యంగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు. భార్యాభర్తల దాంపత్యం సవ్యంగా సాగాలంటే ఈ పనులు చేయకూడదు అంటున్నాడు చాణక్యుడు అవి ఏంటో చూద్దాం. భార్యాభర్తలు ఎప్పుడు ఒకరిని ఒకరు కించపరచుకోకూడదు.
ప్రతి విషయానికి భాగస్వామిని కించపరిచే విధంగా మాట్లాడితే ఆ బంధం బలహీనపడుతుంది. అలాగే కోపంలో ఉన్న భాగస్వామిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అగ్నిలో రాజ్యం పోస్తే ఎలా రగులుతుందో కోపంలో ఉన్న వ్యక్తిని రెచ్చగొడితే అలాగే రగిలిపోతాడు.
అలాంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారో మన ఊహకి కూడా అందదు. కాబట్టి భాగస్వామి కోపంగా అప్పుడు మనం శాంతంగా ఉండడం చాలా అవసరం. అలాగే భార్య భర్తలు ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఎంతో నమ్మకాన్ని కలిగి ఉండాలి.
ఎన్ని గొడవలు అయినా ఎంత కష్టం వచ్చినా నిజాయితీతో ఆ బంధాన్ని కొనసాగించాలి. భాగస్వామి మీద కోపంతో మూడవ వ్యక్తిని బంధంలోకి ఆహ్వానిస్తే మీ భార్యాభర్తల బంధం ముగిసిపోవటమే కాదు మీ జీవితమే పాతాళానికి పడిపోతుంది.
కాబట్టి ఆవేశంతోనో, మరో వ్యక్తి మీద వ్యామోహంతోనో నిర్ణయం తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అలాగే ఎప్పుడూ భాగస్వామితో అబద్ధం చెప్పకండి. మీరు చెప్పిన విషయం అబద్ధం అని మీ భాగస్వామి రూడీ చేసుకున్నట్లయితే ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి.ఒకసారి భాగస్వామి మీద అపనమ్మకం ప్రారంభమైతే ఆ సంబంధం ప్రమాదంలో పడినట్లే.
అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అన్ని రహస్యాలను దంపతులిద్దరూ పంచుకోవలసిన అవసరం లేదు వాటికంటూ కొంత పరిధి ఉంటుంది. వాటిని మాత్రమే షేర్ చేసుకోండి. ఇతరులతో తమ మధ్య జరిగే విషయాలను పంచుకోవడం ద్వారా భార్యాభర్తల అనుబంధం అనేది బలహీనపడుతుంది అది ఆలుమగల మధ్య తగాదాలకు దారితీస్తుంది.