ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. భర్త వ్యాపారంలో చాలా బాగా రాణిస్తున్నాడు. భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆమె కోరుకున్నది తక్షణమే తెచ్చి కళ్ల ముందు పెట్టేవాడు. కానీ.. అవేమీ ఆమెకు తృప్తినివ్వలేదు.
భర్త ఎంత ప్రేమ చూపినా.. పెద్దగా ఆసక్తి చూపేది కాదు. భార్య ప్రవర్తన పై అనుమానం రావడంతో.. నిఘా పెట్టిన భర్తకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
తన భార్య ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 14మంది తో సంబంధం పెట్టుకుందని తెలిసి షాకయ్యాడు. ఆ తర్వాత అతనే రివర్స్ లో ఆమెకు షాకిచ్చాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అతను భార్యను ఎంత ప్రేమగా చూసుకునేవాడు. భార్య కోరింది తక్షణమే ఆమె కళ్లముందు ఉంచేవాడు
అయితే.. అతను ఎంత ప్రేమ చూపినా... ఆమె మాత్రం సఖ్యతగా ఉండేది కాదు. ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడం, బయటకు వెళ్లడం చేస్తుండేది. చాలా కాలం భరించాడు. ఈ మధ్యకాలంలో భార్య మితిమీరిన ప్రవర్తనతో అతనిలో అనుమానం తలెత్తింది. వెంటనే... ఓ ప్రైవేటు డిటెక్టీవ్‌ను ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు.
ఈ క్రమంలో... ఆమె కదలికలను పూర్తిగా అధ్యయనం చేసిన డిటెక్టీవ్... విస్తుపోయే నిజాలను భర్తకందించాడు. ఆయన భార్య... ఒకరికి తెలియకుండా మరొకరితో, అలా మొత్తం పధ్నాలుగు మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో ‘సంబంధం’ నెరపుతోందని తేల్చాడు.
ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.
ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే... తన భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందంటూ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అయితే... కేవలం భార్యకే కాకుండా ఆ పధ్నాలుగు మంది బాయ్‌ఫ్రెండ్స్‌కు కూడా నోటీసులు పంపాడు.
తనకు పరువు నష్టం కింద... రూ. 100 కోట్లను చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.
దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమె బాయ్‌ఫ్రెండ్స్ తలలు పట్టుకున్నారు. మొత్తంమీద కోల్‌కతాలో ఈ విషయం చర్చనీయాంశమైంది.