శృంగారం.. ఇరువురి శరీరాలను మాత్రమే కాదు.. మనసులను కూడా ఏకం చేస్తుంది. శృంగార జీవితం ఎంత ఆనందంగా ఉంటే.. వారి దాంపత్య జీవితం కూడా అంతే అందంగా సాగుతుంది. అయితే.. ఇదొక్క విషయమే కాదు.. శృంగారం కారణంగా మనకు తెలియని ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ ఒకేసారి చూసేద్దామా..?
శృంగారం ఓ మంచి వ్యాయామం లాంటిది. జిమ్ కి వెళ్లి కొన్ని గంటలు కసరత్తు చేయడం వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయగలరో.. కాసేపు శృంగారం చేసి కూడా అంతే క్యాలరీస్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శృంగారంలో పాల్గొంటే దాదాపు 150క్యాలరీస్ తగ్గుతాయి అంటే.. కాసేపు యోగా చేయడం, నడవడం వల్ల కూడా ఇంతే క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే.. సెక్స్ వల్ల మీరు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.
ప్రశాంతంగా నిద్రపోవాలని చాలా మంది ఉంటుంది. అయితే.. పని ఒత్తిడి, ఆలోచనల కారణంగా చాలా మంది సుఖ నిద్రకు దూరమౌతున్నారు. అయితే.. ఈ సుఖ నిద్ర.. శృంగారంతో మీ సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
శృంగారంలో పాల్గొన్న తర్వాత శరీరం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దీంతో.. వద్దన్నా కూడా నిద్ర ముంచుకు వస్తుంది. సెక్స్ కారణంగా శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ లు పెరుగుతాయి. ఇవి నొప్పులను తగ్గించి.. మంచి నిద్ర పట్టడానికి సహాయ పడతాయి.
వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ అనే యాంటీ బాడీస్ తయారు అవుతాయి.
అవి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల శరీరంలో జలుబు, దగ్గు లాంటివి జబ్బులు దాదాపు మీ దరిచేరవు. మీ శరీరంలో 30శాతం అదనపు రక్షణ శృంగారం కారణంగా పెరుగుతుంది.
శృంగారంలో యాక్టివ్ గా ఉండేవారు.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు. శృంగారం కారణంగా శరీరంలో విటమిన్ డి విడుదల అవుతుంది. దాని వల్ల చర్మం కాంతి సంతరించుకుంటోంది.
అంతేకాదు.. శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. 24మంది స్త్రీలు, 22మంది పురుషుల మీద చేసిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది.
రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే మహిళలలో రుతుక్ర సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా.. వారిలో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. దీంతో.. ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయట. ఆరోగ్యంతోపాటు.. ఆనందం, అందం కూడా ఈ శృంగారంతో సొంతమౌతాయని నిపుణులు చెబుతున్నారు.