దాంపత్య జీవితంలో గొడవలకు అనేక కారణాలు ఉంటాయి. వివాహమైన మొదట్లో కొన్ని రోజులు భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కొన్ని రోజులకు వారి మధ్య విభేదాలు (Conflicts) ఏర్పడతాయి. భర్త చెడు అలవాట్లకు (Bad habits) బానిస కావడంతో ఆ భార్యకు మనోవేదన మొదలవుతుంది. చెడు సావాసాలు, చెడు అలవాట్లతో కష్టపడాలనే మనస్తత్వాన్ని కోల్పోయి విలాస జీవితానికి అలవాటు పడతారు. దాంతో భార్య సంపాదన మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.
భార్య తన భర్తను సంతోషపరచడానికి ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు. తన భార్య పైన అనవసరమైన కోపాన్ని (Anger), చికాకును (Irritation) చూపిస్తూ ఆమెను నిరంతరం బాధిస్తూ ఉంటాడు. ఉద్యోగానికి వెళ్ళిన గొడవ పడుతూ ఆమెను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తాడు. ఆమె బాధలను ఎదుటివారితో చెప్పడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని బెదిరించి ఆమెను మరింత ఎక్కువగా భయబ్రాంతులకు గురిచేస్తాడు. ఆమె ఏ పని చేసినా, పరాయి వ్యక్తి తో మాట్లాడిన అనుమానిస్తూ ఆమెను కించపరుస్తూ ఉంటాడు.
ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి భార్య విడాకులు అడిగిన ఇవ్వరు. ఆమెను హింసిస్తూ (Violence) పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఆమె మనసులోని బాధను తన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంది. ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులతో జీవనం సాధించడం ఆడవారికి నరకంగా ఉంటుంది. ఇలాంటి వేదనలకు గురయ్యే మహిళలు లాయర్ ను (Lawyer) సంప్రదించడం అవసరం. వారి లీగల్ సలహాలు తీసుకుని దాన్ని క్రమంగా నడుచుకోవడం మీ జీవితానికి మంచిది.
మీ కుటుంబ సభ్యుల సపోర్టు మీకు అవసరం. వివిధ మహిళా సంఘాల సపోర్టు తీసుకోండి. మీరు మీకు అండగా నిలుస్తారు. మీ జీవన మార్గం సరైన దారిలో వెళ్లేందుకు మహిళా సంఘాల సపోర్ట్ అవసరం. వీరు మీకు సరైన సూచనలు అందిస్తారు. మీలో ఆత్మ విశ్వాసాన్ని (Self-confidence) పెంచుతారు. మీకు ధైర్యంగా పోరాడే శక్తిని అందిస్తారు. మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో డిప్రెషన్ (Depression) లోకి వెళ్లకుండా చూసుకోవాలి. మంచి కౌన్సిలర్ ను కలవండి. అతని కారణంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.
మీరు ధైర్యంగా మీ కాళ్ళపై నిలబడి మీ జీవన పోరాటంలో విజయాన్ని పొంది విముక్తులు కండి. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది. మగవారి పైశాచిక దుర్మార్గాలను (Vices) భరించలేక ఆత్మహత్య (Suicide) ప్రయత్నం చేయకండి.