అతను మీకు ఏదో విధంగా పనుల్లో సహాయ పడుతుంటాడు. అప్పుడు తనకు మీరు ప్రతిఫలంగా థాంక్యూ (Thank you) అనే చిన్న మ్యాజికల్ పదాన్ని చెప్పడంతో మీ మధ్య పాజిటివ్ ఎనర్జీ (Positive energy) ఏర్పడుతుంది. దాంతో మీ బంధం మరింత బలపడుతుంది. మగవారికి బయట ఉన్న టెన్షన్ తో, పని ఒత్తిడి వల్ల విశ్రాంతిని కోరుతారు. మీరు తన ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించాలి. తనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు సరైన ఆలోచనలు, సలహాలు ఇవ్వడం అవసరం.