దాంపత్య జీవితం కలకాలం సంతోషంగా సాగాలంటే ఈ నియమాలను పాటించాల్సిందే!

First Published | Jun 21, 2022, 2:48 PM IST

ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ దాంపత్య జీవితం (Marital life) గురించి పెళ్లికి ముందే ఎన్నో కలలు కంటుంటారు.
 

వివాహమయ్యి కొత్త జీవితం మొదలు పెట్టే సమయంలో వారి దాంపత్య జీవితం ఊహలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. దీంతో వారు కన్న కలలు నిరాశను మిగులుస్తాయి. ఇందుకు మీరు నిరాశ చెందకుండా మీ దాంపత్య జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకునే బాధ్యత మీదే. అప్పుడే మీ దాంపత్య జీవితం సంతోషంగా (Happy) కలకాలం సాగుతుంది. మరి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

వివాహమయ్యి కొత్త జీవితం మొదలు పెట్టే సమయంలో వారి దాంపత్య జీవితం ఊహలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. దీంతో వారు కన్న కలలు నిరాశను మిగులుస్తాయి. ఇందుకు మీరు నిరాశ చెందకుండా మీ దాంపత్య జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకునే బాధ్యత మీదే. అప్పుడే మీ దాంపత్య జీవితం సంతోషంగా (Happy) కలకాలం సాగుతుంది. మరి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


తొందరపడి మాట్లాడరాదు: ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి భాగస్వామి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు. కోపం (Anger) వచ్చినప్పుడు అనాలోచితంగా మాట్లాడడం, చెయ్యి చేసుకోవడం చేయరాదు. నలుగురిలో భాగస్వామిని చులకనగా చూడకూడదు. భాగస్వామి గౌరవమే (Respect) తన గౌరవంగా భావించి ఒకరినొకరు గౌరవించుకోవాలి.

గ్యాప్ ఇవ్వకూడదు: భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కారణంగా మాటల యుద్ధం పెరిగి వారి మధ్య దూరం పెరుగుతుంది. ఇలా ఏర్పడ్డ దూరం మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి దారితీస్తుంది. కనుక ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రాకుండా ఉండాలంటే గొడవకు (Conflict) గల కారణాన్ని తెలుసుకుని వెంటనే పరిష్కరించకుంటే వారి బంధం (Bonding) మరింత పెరుగుతుంది.

నమ్మకం కల్పించాలి: భాగస్వామి చేసే ఏ చిన్న పనిని చులకనగా చూడకుండా అన్ని కష్టనష్టాలలోనూ మీకు నేను తోడు ఉంటాను అనే నమ్మకాన్ని (Believe) కల్పించాలి. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యం. అలాగే ఎటువంటి దాపరికాలు (Hides) లేకుండా ఇద్దరూ మనసులోని భావాలను, ప్రేమను వ్యక్తపరచుకోవాలి. అప్పుడే దాంపత్య జీవితం కలకాలం సంతోషంగా ఉంటుంది.

శృంగార జీవితం బాగుండాలి: దాంపత్య జీవితం అందంగా, మధురంగా ఉండాలంటే శృంగారం (Romance) ప్రధానమైనది. శృంగారాన్ని సంతృప్తిగా ఆస్వాదించే దంపతుల మధ్య ఇతర సమస్యలు (Problems) వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. కనుక శృంగారం పట్ల అయిష్టతను చూపకుండా భాగస్వామిని సంతృప్తిపరిస్తే మీ దాంపత్య జీవితం మరింత అందంగా ఉంటుంది.

సమయాన్ని కేటాయించండి: ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉద్యోగం చేస్తే కానీ నడవని రోజులు. ఇలా దంపతులిద్దరూ తమ పనులకు ఎక్కువ ప్రాధాన్యం (Preference) ఇవ్వడంతో వారి మధ్య దూరం పెరిగి అబద్దాలకు (Liars) దారితీస్తుంది. కనుక ఎన్ని పనులున్నా మీ భాగస్వామితో సరదాగా గడపడానికి రోజులో కొంత సమయాన్ని  కేటాయించాలి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాసేపు గడపాలి.

అలాగే దాంపత్య జీవితంలో అహం (Ego), కోపం, అపార్థాలకు తావుఉండకూడదు. ఇలా చిన్నచిన్న నియమాలను (Rules) పాటిస్తే దాంపత్య జీవితం  సంతోషంగా ఉంటుంది. దాంపత్య జీవితం అంటే ప్రేమ, నమ్మకం, బాధ్యత. ఈ మూడు మీ దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు మీ దాంపత్య  ప్రయాణం సుఖమయంగా అవుతుంది.

Latest Videos

click me!