భార్య భర్తలు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే.. అందుకోసం ఏం చేయాలి అనే విషయంలో మాత్రం వారికి పెద్దగా క్లారిటీ ఉండదు. చాలా మంది పురుషులు పెళ్లికి ముందు చూపించిన శ్రద్ద.. పెళ్లి తర్వాత చూపించరు. అందుకే.. దంపతుల మధ్య బేధాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అయితే.. అలా కాకుండా.. భర్తలు.. తమ బార్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొన్ని.. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఏ భార్య అయినా భర్త ప్రేమకు పడిపోవాల్సిందే.
Image Credit: Instagram
చాలా మంది భార్యలు తమ భర్తల నుంచి సర్ ప్రైజ్ లు ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే.. ఆ సర్ ప్రైజ్ ని అందరిలా కాకుండా భిన్నంగా ఇస్తే.. వారు మీకు ఫిదా అయిపోతారు. మీరు వారి కోసం ఉత్తరాలు రాసి.. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచండి. వాటిని మీ భార్య చదివేలా చేయండి.. వారికి కచ్చితంగా నచ్చుతుంది.
మీ పెళ్లి రోజు, లేదంటే మీ భార్య పుట్టిన రోజు.. లేదా మీరు మొదటిసారి కలుసుకున్న రోజు.. ిలా ఏదో ఒక ప్రత్యేకమైన రోజున ఆమెకు పూల బొకే బహుమతిగా ఇవ్వండి.
Image: Getty Images
మీ భార్యకు బాగా నచ్చిన అన్ని పాటలను కలిపి ఓ ప్లే లిస్ట్ తయారు చేయండి. వాటిని ఓ రొమాంటిక్ డిన్నర్ ఇంట్లోనే ఏర్పాటు చేసి.. వాటిని ప్లే చేసి ఆమెకు వినిపించండి..
Image: Getty Images
ఇద్దరూ ప్రతిరోజూ పనితో చాలా బిజీగా ఉంటారు. పని ఒత్తిడితో కనీసం మనస్పూర్తిగా నవ్వుకొని కూడా ఉండరు. కాబట్టి.. సరదాగా ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. మీరు జోక్స్ వేసి.. మీ భార్య మనస్పూర్తిగా నవ్వేలా చేయాలి.
Image: Getty Images
Will face all the problems together: We often feel alone when we face a problem. But things fall in place and look a lot clearer when we have our partner’s support. Don’t think twice before letting them know that no matter what problem they face or come across, you will always hold their hand and fight it together.
ఆఫీసుల్లో పని బిజీలో ఉన్నప్పటికీ.. మధ్యమ ధ్యలో భార్యకు ఫోన్ చేసి కాస్త ప్రేమగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మధ్యలో ఐ లవ్ యూ లాంటివి చెప్పండి. మీ భార్య ఆనందపడుతుంది.
ఇంట్లో పని, ఆఫీసు పనితో ఇబ్బంది పడుతున్న మీ భార్యకు రిలాక్స్డ్ గా మసాజ్ చేయండి. ఇది వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.
ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా.. అప్పుడప్పుడు.. మీ భార్యను డిన్నర్ కి బయటకు తీసుకువెళుతూ ఉండాలి. స్పెషల్ డేస్ లోనే కాకుండా.. మామూలు రోజుల్లో కూడా తీసుకువెళ్లి సర్ ప్రైజ్ చేయండి.
మీ ఇద్దరూ ఆనందంగా గడిపిన ఫోటోలను ఓ ఆల్బమ్ లా తయారు చేసి.. మీ భార్యకు బహుమతిగా ఇవ్వండి. అది వారికి బాగా నచ్చుతుంది.