ప్రేమించి పెళ్లి చేసుకొని.. జీవితాంతం కలిసి ఉంటామని ప్రామిస్ చేసుకున్న ఎందరో దంపతులు.. కొంతకాలానికే విడాకుల బాటపడుతున్నారు. అలా దంపతులు విడిపోవడానికి డబ్బు, అబద్దాలు, మోసాలు కారణమై ఉండవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే.. అది కూడా నిజం కావచ్చు. అయితే.. అందరూ విడిపోవడానికి ఇవి మాత్రమే కారణం కాదు. దంపతులు తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. పెద్దగా పట్టించుకోని కొన్ని విషయాల వల్లే విడాకులకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
దాంపత్య బంధంలో చిన్న చిన్న విషయాలే.. పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. చాలా మంది చిన్న చిన్న విషయాలే కదా అని పెద్దగా పట్టించుకోరు. ప్రవర్తనలో మార్పులు కూడా.. బంధంలో సమస్యలు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటినే రిలేషన్ షిప్ కిల్లర్స్ అని చెప్పొచ్చు.
చాలా మంది దంపతులు.. తమకంటూ తాము సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోతారు. మొదట్లో ప్రతి విషయాన్ని దంపతులు కలిసే చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. పెళ్లైన కొత్తలో అయినా.. సంవత్సరాలు గడిచినా.. ెవరికి వారు.. వ్యక్తిగతంగా కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలో ఒకరు మరొకరిపై ఆధారపడకూడదు. ఈ శిషయాన్ని తెలుసుకోగలిగితే... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.
చలా మంది.. ఒకరి కోసం మరొకరు తమ హాబీలను మార్చుకుంటూ.. ఏదో త్యాగం చేశామని ఫీలౌతూ ఉంటారు. ఎవరి కోసం.. ఎవరి హాబీలను మార్చుకోకూడదు. పార్ట్ నర్ అభిప్రాయాలకు గౌరవం ఇస్తే సరిపోతుంది. మొదట్లో అలవాట్లు మార్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత.. అవనసరంగా మార్చుకున్నామని బాధపడుతూ కూర్చోవాల్స వస్తుంది. కాబట్టి.. ముందుగానే.. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మీరు ఒంటరిగా ఎందుకు గడపాలి అనుకుంటున్నారనే విషయాన్ని మీ పార్ట్ నర్ కి తెలియజేయాలి. అలా అని.. దంపతులు కలిసి సమయం గడపకూడదు అని కాదు.. వారిద్దరూ కలిసి సమయం గడపాలి.. అయితే.. వ్యక్తిగతంగా కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఒకరినొకరు గౌరవిస్తూ ఉండాలి.
ఇక చాలా మంది దంపతులు.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు న మాత్రమే... వారి ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ.. అది చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. నిజంగా ప్రేమ ఉంటే.. అది చెప్పడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. చెప్పాలని అనిపించినప్పుడల్లా చెప్పేయాలి. మీరు ఎంతలా ప్రేమిస్తున్నారనే విషయం వారికి చెప్పకపోతే ఎలా అర్థమౌతుంది.
వారు మీ ప్రేమ కోరుకుటున్నారన్న సందర్భంలో ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి. ఆ సమయంలో మీరున్నామనే ధైర్యం వారికి ఇవ్వలేకపోతే.... ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ తగ్గిపోతుంది.
ప్రతి రోజు, మీ భాగస్వామిని వారు ఎంతో ఆదరిస్తున్నారని, ప్రశంసించబడ్డారని , గుర్తింపు పొందారని చూపించడానికి ఏదైనా చేయండి లేదా చెప్పండి. ఒక సాధారణ ముద్దు, మనసులో నుంచి ఓ మంచి మాట చాలు. పార్ట్ నర్ తో.. ఎమోషనల్ గా మీరు చెప్పే కొన్ని మాటలే.. మీ బంధానికి బలాన్ని తీసుకువస్తాయి.
ఇంత కష్టతర పరిస్థితుల్లో అయినా , ఎంత బిజీగా ఉన్నా.. మీ పార్ట్ నర్ తో కనీసం ఫోన్ లో అయినా పది నిమిషాల పాటు మాట్లాడాలి. ఇలా ప్రేమగా మాట్లాడుకోవడం.. సరదాగా గడపడం లాంటివి చేయాలి. అప్పుడు మీ బంధం ఎలాంటి విభేదాలు లేకుండా.. ఆనందంగా సాగుతుంది.