శృంగారం అనేది ఇరు శరీరాల కలయిక మాత్రమే కాదు. ఇద్దరి మనసులను కూడా ఏకం చేస్తుంది. అంతేకాదు.. శృంగారం అనేది కేవలం ఒక్కరికి మాత్రమే భావప్రాప్తి కలగడం కాదు.. ఇద్దరికీ కలగడం. మామూలుగా పురుషులకు మాత్రమే భావప్రాప్తి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది.. స్త్రీలకు వారు కోరకున్నంత భావప్రాప్తి కలగదని చెబుతూ ఉంటారు. అలా కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అసలు మహిళల భావప్రాప్తి గురించి ఈ విషయాలు మీకు తెలుసో లేదో చూద్దాం..
1.మహిళలకు సెక్స్ లో భావప్రాప్తి కలిగితే.. వారిలో ఉన్న నొప్పులు తగ్గుతాయట. తలనొప్పి, శరీరంలో ఏదైనా నొప్పి.. ఇలా ఏ నొప్పి అయినా భావప్రాప్తి పొందినప్పుడు పోతుందట. వారికి ఆ నొప్పి తగ్గిపోయి.. చాలా రిలాక్స్డ్ అనే ఫీలింగ్ కలుగుతుందట.
2.ఇక చాలా మంది అనుకుంటారు.. పురుషులు కండోమ్ ధరిస్తే... మహిళలకు భావప్రాప్తి కలగదు అని అనుకుంటారట. కానీ... కండోమ్ ధరించినా సరే వారికి భావప్రాప్తి కలుగుతుందట. కండోమ్.. వారి భావప్రాప్తికి ఎలాంటి ఆటంకం కలిగించదట.
3.ఇక పురుషులకు కలిగినంత సులభంగా మహిళలకు భావప్రాప్తి కలగదట. మహిళలకు భావప్రాప్తి కలగడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుందట. ఆ విషయం చాలా మంది పురుషులకు అర్థం కాదట.
4.దాదాపు అందరూ.. వయసు పెరిగే కొద్దీ సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ... మహిళల్లో వారి వయసు పెరిగే కొద్దీ భావప్రాప్తి పెరుగుతుందట. వారి వయసుతో పాటు.. వారిలో కలయిక పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందట.
5.మహిళలు కలయిక సమయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే... వారికి భావప్రాప్తి అంత తొందరగా లభిస్తుందట. కాబట్టి వారు.. చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం చాలా అవసరం.
6.మీకు తెలుసో లేదో.. దాదాపు చాలా మంది మహిళలు సెక్స్ లో భావప్రాప్తి పొందడం లేదట. అయితే.. ఆ అనుమానం భర్తకు రాకుండా ఉండేందుకు భావప్రాప్తి కలగకపోయినా... కలిగినట్లు నటిస్తూ ఉంటారట.
7.చాలా మంది నమ్మలేని మరో నిజం ఏమిటంటే.. మామూలు స్త్రీల కంటే కూడా లెస్బియన్స్ కి.. భావప్రాప్తి చాలా ఎక్కువగా కలుగుతుందట.