సెక్స్ సమయంలో మహిళలు చేసే తప్పులు ఇవే..!

First Published | Jun 3, 2022, 10:15 AM IST

నిజానికి మీరు వారికి నిజం చెప్పడమే ఎక్కువగా నచ్చుతందట. మీ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని పురుషులు అనుకుంటూ ఉంటారట. కాబట్టి.. మీ ఇష్టాలు మీ లోపలే దాచుకోని పొరపాటు చేయకండి.

death during sex

సెక్స్ ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దీనిపై ఆసక్తి అందరిలోనూ ఉన్నప్పటికీ.. దీని గురించి మాట్లాడటానికి మాత్రం పెద్దగా ఎవరూ చొరవ చూపించరు. ఇక కొందరైతే.. వీటి గురించి మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో ఉండిపోతారు. ఈ క్రమంలోనే.. తెలిసీ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు సెక్స్ సమయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మహిళలు అస్సలు చేయకూడని తప్పులేంటో మనం ఓసారి చూద్దాం..

sex

మనిషి అన్నాక.. ప్రతి ఒక్కరికీ ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. మన ఇష్టం ఏంటో.. అయిష్టమేంటో చెప్పకుంటే ఎదుటివారికి ఎలా తెలుస్తుంది..? ఇక సెక్స్ విషయానికి వస్తే కచ్చితంగా మీకు ఏది నచ్చుతుంది..? ఏది  నచ్చదు అనే విషయాన్ని మీ పార్ట్ నర్ కి చెప్పాలి.


sex

చాలా మంది స్త్రీలు తమకు ఏది నచ్చుతుంది..?  ఏది నచ్చదు అనే విషయాన్ని తమ పార్ట్ నర్ కి చెప్పడం లేదట. నిజానికి మీరు వారికి నిజం చెప్పడమే ఎక్కువగా నచ్చుతందట. మీ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని పురుషులు అనుకుంటూ ఉంటారట. కాబట్టి.. మీ ఇష్టాలు మీ లోపలే దాచుకోని పొరపాటు చేయకండి.

ఆడవారు సిగ్గుపడితే అందంగా ఉంటుంది. నిజమే.. కానీ అది అన్ని సమయాల్లో మాత్రం కాదు.  ముఖ్యంగా సెక్స్ విషయంలో ప్రతిసారి సిగ్గుపడితే కష్టం. అప్పుడప్పుడు మీరు కూడా సెక్స్ విషయంలో ముందుగా చొరవ తీసుకుంటే బాగుండని పురుషులు కోరుకుంటారు.  

ప్రతిసారీ పురుషులే చొరవ తీసుకోవాలి అనేది రూల్ కాదు. మీకు కావాలని మనసులో ఉన్నా.. చెప్పకుంటే వారికి ఎలా తెలుస్తుంది. చాలా తక్కుమ మంది పురుషులు మాత్రమే మనసు చదవగలరు. అందరికీ అర్థం కాదు. కాబట్టి.. మీరు కూడా చొరవ చూపించడం మంచిది.

ఇక చాలా మంది మహిళలు..పిల్లలు పుట్టిన తర్వాత తమ బాడీ మారిపోయిందని... షేప్ అవుట్ అయిపోయిందని.. ఇక తాము తమ భర్తకు నచ్చమని తమలో తామే ఫీలౌతూ ఉంటారు. అయితే.. ఆ మార్పులను కూడా భర్త అంగీకరిస్తాడనే విషయాన్ని మీరు గుర్తించాలి. మీ శరీర మార్పులను, లోపాలను తలుచుకొని ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడకూడదట.

ఇక చాలా మంది మహిళలు.. సెక్స్ మధ్యలో భర్త మూడ్ పోగొట్టేలా వేరే టాపిక్ మాట్లాడుతూ ఉంటారట. దాని వల్ల పురుషులకు అసలు మూడ్ మొత్తం పోతుందట. దాని వల్ల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

click me!