సెక్స్ కి ముందు, తర్వాత.. ఈ పనులు మాత్రం చేయకండి..!

First Published | May 31, 2022, 1:19 PM IST

మనం తెలిసో తెలియకో.. ఈ శృంగారం విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా సెక్స్ కి ముందు, తర్వాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి మీ మూడ్ ని నాశనం చేసేస్తాయట. 

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తిండి, నిద్ర, దుస్తులు ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. చాలా మంది ఒప్పుకోకపోయినప్పటికీ.. సెక్స్ పట్ల ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆ ఆసక్తి కొందరిలో తక్కువగా ఉంటే... మరికొందరిలో ఎక్కువగా ఉండొచ్చు. అనుభవం ఉన్న వారికైనా.. అనుభవం లేనివారికైనా కూడా దీని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. కాగా.. మనం తెలిసో తెలియకో.. ఈ శృంగారం విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా సెక్స్ కి ముందు, తర్వాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి మీ మూడ్ ని నాశనం చేసేస్తాయట. మరి  అవేంటో ఓసారి చూద్దామా..
 

మీరు వినే ఉంటారు... చాలా మంది మందు తాగితే తమకు మూడ్ వస్తుంది అని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి అందులో ఏ మాత్రం నిజం లేదట. సెక్స్ కి ముందు మద్యం సేవించడం మంచిది కాదు. ఎదో కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు కానీ.. మరీ ఎక్కువగా తీసుకొని.. ఆ తర్వాత కలయికలో పాల్గొంటే మాత్రం.. ఏ మాత్రం తృప్తిని ఇవ్వదట. సెక్స్ పై ఆసక్తి తగ్గిపోయి భావప్రాప్తి కలగదు. కాబట్టి.. మద్యానికి దూరంగా ఉండటం మంచిది.


sex

సెక్స్ తర్వాత మనం చేసే కొన్ని పొరపాట్లు.. గర్భం దాల్చడానికి కారణమౌతాయట. ముఖ్యంగా.. కలయిక తర్వాత పొత్తి కడుపును పైకి ఎత్తకూడదట. అలా ఎత్తడం వల్ల.. మహిళలు చాలా తొందరగా గర్భం దాల్చే అవకాశం ఉందట.


ఇక సెక్స్ కి ముందు చాలా మంది స్నానం చేయడానికి ఇష్టపడరు. తర్వాత చేద్దామని అనుకుంటారు. కానీ... కలయికలో పాల్గొనడానికి ముందే స్నానం చేయాలట. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవాలి. ఓరల్ సెక్స్ చేసేవారు ఈ పని కచ్చితంగా చేయాలి. లేదంటే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది.

sex

సెక్స్ తర్వాత టాయ్ లెట్ కి వెళ్లి మూత్ర విసర్జన చేయాలి. ఇది నిజమే. కానీ.. దాని కోసం వెంటనే.. బెడ్ మీద నుంచి బాత్రూమ్ కి పరుగులు తీయడం మంచిది కాదు. మరీ అత్యవసరమైతే తప్ప.. వెంటనే బాత్రూమ్ కి పరిగెత్తకూడదు.

Image: Getty Images

ఇక చాలా మంది కలయికను ఆస్వాదించడానికి సెక్స్ టాయ్స్ ని వాడుతూ ఉంటారు. అయితే... ఆ టాయ్స్ ని వాడేటప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Image: Getty Images

ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన కూరగాయలు, చిక్కుళ్ళు , తృణధాన్యాలు తీసుకోండి, కానీ సెక్స్‌కు ముందు మాత్రం చేయకూడదు, అది మీకు గ్యాస్ సమస్య తీసుకురావచ్చు. అంతేకాదు కలయికలో పాల్గొనడానికి ముందు కనీసం ఒక గంట లేదా రెండు గంటల ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ మానుకోండి. సెరోటోనిన్ స్థాయిలను పెంచే విధంగా మీరు ఒక చిన్న చాక్లెట్ ముక్కను కూడా తీసుకోవచ్చు.

Latest Videos

click me!