ఈ విషయాల్లోనే ప్రజలు ఎక్కువగా పశ్చాత్తాపం చెందుతారు..!

First Published | Nov 22, 2021, 11:51 AM IST

కొందరు.. బయటి ప్రపంచం చూడకుండా.. ఇల్లే ప్రపంచంగా బతికేస్తూ ఉంటారు. బయటి వ్యక్తులతో కలిసిపోయి మాట్లాడలేరు. ఈ విషయంలో జీవిత చరమకాలంలో బాధపడుతూ ఉంటారట.

జీవితంలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి... పోతూ ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు.. మనం ఎంచుకునే మార్గాలు మారుతూనే ఉంటాయి. అయితే.. అలా మనం తీసుకునే నిర్ణయాలు.. మన జీవితాన్ని కూడా మార్చుతాయి. 

ఆ మార్పు మంచైనా కావచ్చు.. లేదంటే చెడు అయినా అయ్యే అవకాశం ఉంది. అయితే.. జరిగిన దానిని తలుచుకొని.. ఆ రోజు ఇలా చేయకుండా ఉండవలసి ఉంది..? అలా ఎందుకు చేశాను.. అంటూ చాలా మంది పశ్చాత్తాప పడుతున్నారట. అలా చాలా మంది.. పశ్చాత్తాప పడే కొన్ని సందర్భాలు ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం..

Latest Videos



చాలా మంది, మీరు గమనిస్తే, మంచి కొడుకు, కుమార్తె, భార్య, భర్త, బిడ్డ కానందుకు పశ్చాత్తాపపడతారు. ఇది వారిని మనసుని తలచివేస్తూ ఉంటుంది. మీరు కలిగి ఉన్న సంబంధాలకు కుటుంబం అత్యంత సన్నిహితమైనది అని మీరు గుర్తుంచుకోవాలి. మీ స్నేహితులు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, మీ కుటుంబం ఒక్కసారిగా ఉంటే, మిమ్మల్ని ఎవరూ హాని చేయలేరు. కాబట్టి ఆ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రజలు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి.

పని, డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగమని ప్రజలు తరచుగా మరచిపోతారు.  జీవితమంతా సంపాదనమీదే దృష్టిపెడుతూ ఉంటారు. అయితే.. తర్వాత ఈ విషయంలో పశ్చాత్తాపడుతూ ఉంటారట.

డబ్బు సంపాదించినప్పుడు.. వాటితో.. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలరు. కానీ.. ఆ డబ్బు సంపాదనలో పడి.. అంతకన్నా విలువైన కుటుంబసభ్యులతో గడపడం మానేస్తున్ారు. దీంతో.. వారు ఈ విషయంలో అంతా కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు.

కొందరు.. బయటి ప్రపంచం చూడకుండా.. ఇల్లే ప్రపంచంగా బతికేస్తూ ఉంటారు. బయటి వ్యక్తులతో కలిసిపోయి మాట్లాడలేరు. ఈ విషయంలో జీవిత చరమకాలంలో బాధపడుతూ ఉంటారట. మేము ఏదీ చూడలేకపోయాం.. ఎవరినీ కలవలేక పోయాం.. జీవితం చాలా సాదా సీదాగా సాగిపోయిందని ఫీలౌతూ ఉంటారట.

జీవితంలో రిస్క్ తీసుకోవడం అనేది ఎదుగుదలలో భాగం. మీకు ఆలోచనలు, కోరికలు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడితే, “జో దర్ గయా, సంఝో మార్గయ” గుర్తుంచుకోండి. మీరు విఫలమైతే, మీరు దాని నుండి నేర్చుకుంటారు. రిస్క్ చేయకుండా ఉండిపోతే... దాని గురించి ఫీలౌపోతూ ఉంటారు. 

click me!