పెళ్లికి ముందే మీ భాగస్వామిని అడగాల్సిన విషయాలు ఏంటో తెలుసా?

First Published | Nov 21, 2021, 6:14 PM IST

పెళ్లి (Marriage) అనేది పరమ పవిత్రమైనది. పెళ్లికి కులంతో సంబంధం లేకుండా అన్ని మతాలవారు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఇద్దరి మనుషులను ఒక్కటి చేసే పరమ పవిత్రమైన కార్యం. పెళ్లి అనేది ఇద్దరి మనుషులను పెద్దల సమక్షంలో ఒకటి చేస్తుంది. పెద్దల ఆశీర్వాదాలతో వారి నిండు నూరేళ్ళ జీవన ప్రయాణాన్ని మొదలు పెడతారు. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు వ్యక్తులు వారి గురించి ఒకరినొకరు పెళ్లికి ముందే తెలుసుకోవడం మంచిది. అప్పుడే వారి జీవన ప్రయాణం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సాగుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా పెళ్లికి ముందు మీ భాగస్వామి గురించి అడగవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం..
 

పెళ్లి చేసుకోవాలని ఇద్దరు వ్యక్తులు నిర్ణయించుకున్నప్పుడు వారి గురించి ఒకరినొకరు పెళ్ళికి ముందే పూర్తిగా తెలుసుకోవడం మంచిది.వారి అలవాట్లను (Habits), అభిరుచులను (Tastes) ముందుగా తెలుసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలు అలవాట్లు ఒకటే ఉన్నప్పుడు ఇద్దరికీ ఇష్టం అయితే అప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇలా చేయడంతో వారి జీవన ప్రయాణం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడుస్తుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. దాంతో ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అయితే పెళ్లకి ముందే కాబోయే భాగస్వాములతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.

ఇలా చర్చించడంతో మీ వివాహం పట్ల ఒక  స్పష్టత (Clarity) అనేది ఏర్పడుతుంది. మొదట మీరు పెళ్లికి ఒప్పుకోవడానికి పెద్దల ఒత్తిడి (Pressure) ఉందో లేదో కనుక్కోవాలి. వయసు పైబడటంతో లేదా చిన్నవయసులోనే పెద్దలు పెళ్లి చేసుకోమని పిల్లలపై ఒత్తిడి చేస్తుంటారు. వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లికి ఒప్పించేందుకు పెద్దలు ప్రయత్నిస్తారు. అలా వారు పెళ్లికి ఒప్పుకోవడానికి కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉందో లేదో కనుక్కోవాలి. వారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటే వివాహం తరువాత ఎలాంటి సమస్యలు రావు.


పెళ్లి తర్వాత ఉద్యోగం (Job) చేయవచ్చా అని మీ భాగస్వామిని అడగాలి. మీ ఉద్యోగ విషయంలో మీ భాగస్వామి అనుకూలంగా (Compatible) ఉన్నారో లేదో తెలుసుకోవాలి. పెళ్లి తర్వాత ఇంటినే చూసుకుంటారా లేదా ఉద్యోగం వైపు అడుగులు వేస్తారా అని మీ భాగస్వామిని అడగాలి. పెళ్లి తర్వాత మీ ఉద్యోగపరంగా భాగస్వామి పూర్తిగా ఎంకరేజ్మెంట్ చేస్తారో లేదో కనుక్కోవాలి. అప్పుడే మీ జీవన ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వారు మీ కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలి. 
 

పెళ్లి తరువాత మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో దానిపట్ల స్పష్టత (Clarity) ఏర్పరుచుకోవాలి. వారి ఇష్టాయిష్టాలను (Preferences), అభిరుచులను పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండేటట్లు చూసుకోవాలి. భాగస్వామి భిన్నాభిప్రాయాలను పూర్తిగా తెలుసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే పెళ్లి తర్వాత మీ జీవన ప్రయాణం సుఖ సంతోషాలతో సాగుతుంది.

Latest Videos

click me!