ఎంతటి అన్యోన్య దాంపత్యం అయినా సంసారం అన్నాక గొడవలు తప్పవు. అయితే సంసారంలో గొడవలు వస్తూ ఉండాలి పోతూ ఉండాలి. మళ్లీ అలాంటి గొడవ జరగకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకుంటూ అన్యోన్యంగా ఉండాలి. అయితే కొంతమంది మగవాళ్ళలో ఉండే లక్షణాలు ఆ గొడవాలని మరింత పెద్దవి చేస్తాయి.
అవి వారి భార్యలకు మరింత నరకాన్ని చూపిస్తాయి. అవేమిటంటే సాధారణంగా గొడవలు జరిగినప్పుడు తన తప్పేమీ లేదని భార్య వల్లే మొత్తం గొడవ జరిగిందని భార్యని బ్లైమ్ చేస్తాడు. ప్రపంచానికి కూడా అలాగే పరిచయం చేస్తాడు బయట వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పంతా భార్యదే అనుకుంటారు.
అలాగే వారి భార్యలు అందంగా ఉంటే అనుమానంతో రగిలిపోతారు, ఎదుటివారి భార్య అందంగా ఉంటే అసూయతో రగిలిపోతారు ఇలాంటి లక్షణం ఉన్న మగవాడి భార్య ఒకంతట సుఖంగా ఉండలేదు.
తనకి వచ్చిన కోపం బాధ లాంటి లక్షణాలని బయట వారి మీద చూపించలేని ఒక చేతకాని భర్త తన భార్య మీద మాత్రం కర్కసంగా ఆ కోపాన్ని అంతా తీర్చుకుంటాడు. అలాంటి భర్తకి భార్యగా ఉన్న ఆడది నరకాన్ని చూస్తుంది. అలాగే భార్య అంటే బానిస అనుకునే భర్తలు, భార్య చేసే ప్రతి పని తనకి చెప్పి చేయాలని, తన పర్మిషన్తో చేయాలని భావిస్తాడు.
అలాగే భార్యలు బాధపడుతుంటే అది భర్తగా తన విజయం అనుకుంటాడు. అలాగే భార్య చేసే ప్రతి పనిలోనే తప్పు పడుతుండటం మగవాడి యొక్క వీక్నెస్, అతని ఇన్ఫీరియారిటీ ఈ విధంగా చూపించుకుంటాడు. తన భార్య ఏ విధంగానూ పై స్థాయిలో ఉండడానికి ఒప్పుకోడు.
ఈ లక్షణాలు ఉన్న భర్తలను నిజంగా ఏ ఆడది భరించలేదు. చాలా విషయాలలో భర్తలతో సర్దుకోవచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం భార్యలు కొంచెం సీరియస్ గా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి.