అమ్మాయిల విషయంలో అబ్బాయిలు చేసే పెద్ద తప్పులు ఇవే!

First Published | Sep 24, 2022, 1:00 PM IST

సాధారణంగా భార్యాభర్తలు జీవితంలో ఎంతో సంతోషంగా పదికాలాలు పాటు అన్యోన్యంగా ఉండాలని భావిస్తారు.అయితే అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఏమాత్రం పొరపాటు చేసినా అమ్మాయిలు వారికి శాశ్వతంగా దూరం అవుతారు. ఇక అబ్బాయిలు అమ్మాయిల విషయంలో చేసే ఈ తప్పుల వల్లే అమ్మాయిలు దూరం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ తప్పులు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం...
 

అమ్మాయిలు ఎలాంటి వారైనా సరే వాళ్ళు ఎక్కువ సమయాన్ని తమ జీవిత భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే అబ్బాయిలు కూడా తమ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడాలి.అలాకాకుండా నిత్యం స్నేహితులతో సమయం గడపడం వల్ల మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి మీకు దూరం అవుతారు.
 

ఇకపోతే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితుల సమక్షంలో ఎప్పుడు కూడా మీ జీవిత భాగస్వామిని హేళన చేయకూడదు. ఇలా వారిని హేళన చేస్తూ మాట్లాడటం లేదంటే వారిపై కోపం ప్రదర్శించడం, వారిని చులకనగా చూడడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామి మీ నుంచి దూరం అవుతారు.
 


ఇక బయట ఎన్నో పనులకు వెళ్తూ ఎంతో ఒత్తిడి ఆందోళనలని కలిగి ఉంటారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ టెన్షన్స్ మీ భార్యపై చూపించడం మంచిది కాదు.బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత వారితో ప్రేమగా మాట్లాడటం ఎంతో అవసరం. ఇక ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవిత భాగస్వామికి నేనున్నాననే భరోసా కల్పించడం ఎంతో ముఖ్యం.
 

ఎక్కువగా సిగరెట్, ఆల్కహాల్ తాగడం అమ్మాయిలకి ఇష్టం ఇష్టం ఉండదు.. పైగా ఇవి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి అలవాట్లకు బానిస కావటం వల్ల జీవిత భాగస్వామి కూడా దూరమయ్యే పరిస్థితిలో ఏర్పడతాయి అలాగే ఇద్దరు మధ్య బంధం బలంగా ఉండాలంటే నమ్మకం ఎంతో ముఖ్యం ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది ఉండదో ఆ బంధం ఎక్కువ కాలం పాటు నిలబడదు.

Latest Videos

click me!