బెస్ట్ ఫ్రెండ్ తో సెక్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి...!

First Published | Sep 23, 2022, 2:02 PM IST

కొన్నిసార్లు కావాలని ఈ రిలేషన్ లోకి రాకపోవచ్చు. పొరపాటున జరిగే అవకాశం ఉంది. కాబట్టి... ఆ సమయంలో.. మీరు మీ గురించి ఆలోచించుకోవాలి.  అంటే.. మీరు చేసింది తప్పు అని భావిస్తున్నారా...? లేదంటే ఇలాంటిది మళ్లీ జరగకూడదని అనుకుంటున్నారా..? లేదు.. దానిని మళ్లీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో ఆలోచించాలి.

శృంగారం అనేది కేవలం భార్యభర్తలకు సంబంధించినది మాత్రమే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు.. దీనిలోనూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెళ్లికి ముందు లవర్ తో తొందరపడేవారు కొందరు ఉన్నారు. కానీ ఈ మధ్య ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ పేరిట... బెస్ట్ ఫ్రెండ్స్ కూడా రిలేషన్ పెట్టుకుంటారు. అంటే... వారు సెక్స్ లో పాల్గొంటారు. కానీ లవర్స్ కాదు.. అలా అని పెళ్లి చేసుకోరు. కేవలం ఫ్రెండ్స్ లా మాత్రమే ఉంటారుట. అయితే... ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కొన్నిసార్లు కావాలని ఈ రిలేషన్ లోకి రాకపోవచ్చు. పొరపాటున జరిగే అవకాశం ఉంది. కాబట్టి... ఆ సమయంలో.. మీరు మీ గురించి ఆలోచించుకోవాలి.  అంటే.. మీరు చేసింది తప్పు అని భావిస్తున్నారా...? లేదంటే ఇలాంటిది మళ్లీ జరగకూడదని అనుకుంటున్నారా..? లేదు.. దానిని మళ్లీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో ఆలోచించాలి.


ఇది కేవలం సెక్స్ గురించి ఆలోచించడం లేదా మీరు అనుమతించడం కంటే వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతున్నారా లేదా ఇది మళ్లీ జరగాలని మీరు కోరుకుంటున్నారా అనే దాని గురించి ఆలోచించడం ఉత్తమం. వెంటనే కాదు.. కావాలంటే రెండు, మూడు రోజులు సమయం తీసుకోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఇద్దరికీ చేసిన పనిలో తప్పు లేదు అని భావించినా.. దానిని కొనసాగించాలి అనిపించినా అది వేరు. అలా కాకుండా.. పొరపాటుగా జరిగిందని మీరు భావించి.. మళ్లీ ఇలాంటిది జరగకూడదు అనుకున్నా.. వారికి వెంటనే చెప్పాలి. ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు.

అంతేకాదు.. ఈ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉండాలి.  వారిపై ఇష్టం ఉన్నా... లేకున్నా.. ఈ విషయంలో అస్సలు అబద్దం చెప్పకూడదు. అయితే... ఒక్కసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత...  మీ స్నేహం మునుపటి రోజులాగే ఉంటుందని భావించి తొందరపడకండి.

అంటే... మీరు తీసుకున్నంత క్యాజువల్ గా ఎదుటి వ్యక్తి తీసుకోకపోవచ్చు. కాబట్టి... వారితో మాట్లాడాలి. తమతో ఎప్పటిలాగే ఉండమని బలవంత చేయవద్దు. వారికి కొంత సమయం ఇవ్వాలి.

Latest Videos

click me!