masturbation
హస్త ప్రయోగం. దీని గురించి దాదాపు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అయితే.. సెక్స్ జీవితంలో తృప్తి లేని వారు.. లేదంటే.. పెళ్లి కానివారు మాత్రమే.. దీనిపై ఆసక్తి చూపుతుంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. అందులో నిజం లేదట. లైంగిక తృప్తి సంతృప్తిగా ఉన్నవారు కూడా.. హస్తప్రయోగంలో పాల్గొంటారు. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుందట. అందుకే.. దీని పట్ల ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారట. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అయితే.. తెలిసీ తెలియక.. ఈ హస్త ప్రయోగం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారట. మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దామా..
సాధారణంగా సెక్స్ జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఇద్దరు ఉండాలి. కానీ హస్తప్రయోగంలో మాత్రం.. ఎవరికి వారు స్వయంగా.. ఆ ఆనందాన్ని పొందుతారు. ఒంటరిగా ఉన్న సమయంలో.. దీనిని ఆస్వాదిస్తూ, ఆనందం పొందడమే దీని కాన్సెప్ట్. అయితే.. దీనిని కూడా చాలా మంది హడావిడిగా చేస్తూ ఉంటారట. అలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
దీనిని ప్రారంభించే ముందు.. మీరు సరైన మానసిక స్థితిని సెట్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధించబడుతుంది. హస్తప్రయోగం అనేది సెక్స్ మాదిరిగానే సమయం తీసుకుంటుంది. ఆనందం చివరి అంచులను చేరుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం. హడావిడి చేయకుండా.. ప్రశాంతంగా ఉండాలి. గదిలో లైట్ ఆఫ్ చేయాలి. మీకు నచ్చిన వీడియో పెట్టుకొని.. ఆ తర్వాత ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాలి.
హస్తప్రయోగం ఆస్వాదించే సమయంలోనూ.. మనకంటూ వీలుగా ఉండే ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ లోనే దానిని ఎంజాయ్ చేయాలి. అయితే.. ఎప్పుడూ ఒకేలా ప్రయత్నించడం బోర్ కొట్టొచ్చు. అలాంటప్పుడు.. వివిధ పొజిషన్ల లో ట్రై చేయవచ్చు. అయితే.. మరీ ఫాంటసీలోకి వెళ్లిపోయి.. వింతగా మాత్రం ప్రయత్నించకూడదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
సోలోగా సెక్స్ ఫీల్ కలిగేంచేలా ఎంజాయ్ చేసే ఈ హస్త ప్రయోగం.. క్లైమాక్స్ చేరుకోవడం కోసం ఆత్రుత పడకూడదు. ఇది కేవలం క్లైమాక్స్ కి చేరుకోవడం మాత్రమే కాదు... మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. సెల్ఫ్ లవ్ ఉన్నవారు.. హస్త ప్రయోగాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడతారు. వేగంగా అంటే.. ఆనందించేలా.. నెమ్మదిగా దీనిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
హస్త ప్రయోగాన్ని మీరు సెక్స్ టాయ్స్ తో కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇవి మరింత ఆనందాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయట. మార్కెట్లో, స్త్రీ, పురుషులకు విభిన్న సెక్స్ టాయ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి ప్రయత్నించవచ్చు. అయితే.. వాటిని ఉపయోగించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
హస్తప్రయోగం అనేది ఆనందాన్ని కోరుకునే చర్య. దీనిని బలవంతంగా చేయడమో లేదంటే.. కేవలం రెండు నిమిషాల్లో ముగించడం లాంటివి చేయకూడదు. ఇది కేవలం.. ఒక మృదువైన స్పర్శను కోరుకుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఇది ఆరోగ్యానికి మంచిదే కదా.. ఎలాంటి హాని చేయదు కదా అని.. రోజుకు మూడు,నాలుగు సార్లు చేయకూడదు. వారానికి రెండు లేదంటే.. మూడుసార్లు చేస్తే సరిపోతుంది.