ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏదైనా ఇష్టాలు కలువనప్పుడు విడిపోవడం ఖాయం. కానీ బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకపోవచ్చు అంటున్నారు నిపుణలు. మరి స్నేహితులను పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
స్నేహితులను పెళ్లి చేసుకుంటే?
సాధారణంగా స్నేహితులు ఒకరిపై ఒకరు ఇష్టం కలిగి ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఉంటారు. అలవాట్లు, ఇష్టాలు, కష్టాలు అన్నీ స్నేహితులకు తెలుస్తాయి. కాబట్టి స్నేహితులను పెళ్లి చేసుకుంటే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. ఎలాంటి విషయాన్ని అయినా ఇద్దరు ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం ఉంటుంది.