Relationship: కూతురికి నాన్నే సూపర్ హీరో.. ఎందుకో తెలుసా?

సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమ పిల్లలపై ఒకే రకంగా ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ ఆడపిల్లలపై కాస్త ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది వారి బంధం చూస్తే. నిజమే తండ్రి- కూతురు, తల్లి- కొడుకు మంచి బాండింగ్ తో ఉంటారు. మరి ఈ బంధం వెనకు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే చూసేయండి మరీ.

తల్లిదండ్రులు పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తారు. పిల్లలందరిపై ఒకేలా ప్రేమ చూపిస్తారు. కానీ కూతురు తండ్రితో ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అబ్బాయి అమ్మతో కనెక్ట్ అవుతాడు. కూతుర్లకు వాళ్ళ నాన్నే సూపర్ హీరో. నాన్నే రోల్ మోడల్. ఈ ప్రపంచంలో నాన్న కంటే గొప్పవాళ్లు ఎవరూ లేరనే ఫీలింగ్ వారిది. అసలు తండ్రి, కూతుర్ల మధ్య అంత స్ట్రాంగ్ బంధం ఎందుకు ఉంటుందో ఇక్కడ చూద్దాం. 

తండ్రి, కూతుర్ల బంధం

సాధారణంగా అబ్బాయిలు తల్లితో మంచి సంబంధం కలిగి ఉంటారు. అమ్మాయిలు తండ్రితో మంచి బంధం కలిగి ఉంటారు. దీని వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.


సురక్షిత భావన

నాన్న ఎప్పుడూ తన కూతుళ్లకు భద్రత, రక్షణ భావాన్ని కలిగిస్తాడు. కాబట్టి కూతుళ్లు తండ్రికి దగ్గరవుతారు. నాన్న అంటే సేఫ్ ప్లేస్ అనే భావన కూతుళ్లలో ఉంటుంది.

తండ్రి హృదయం

తండ్రి హృదయం దయతో నిండి ఉంటుంది. ఇది తన కూతుళ్ళను ఎప్పుడూ తమతోనే ఉండేలా చూసుకుంటుంది. అందుకే కూతుర్లకు నాన్న అంటే చాలా ప్రేమ. 

ప్రతి క్షణం కలిసి ఉండటం

మంచి, చెడు, కష్టం, నష్టం ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా.. అన్ని వేళలా అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి తండ్రి. కూతుళ్లు తమ తండ్రిలోని ఈ గుణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. 
 

ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం

నాన్న తన కూతుళ్ల చిన్నచిన్న అవసరాలు, భావనలను బాగా అర్థం చేసుకుంటాడు. దీనివల్ల కూతుళ్లు తమ విషయాలన్నింటినీ, కావాల్సినవి, వద్దనుకున్నవి నాన్నతో హాయిగా మాట్లాడుతారు. 

స్వతంత్రంగా ఉండాలనే కోరిక

నాన్న ఎక్కువగా తన కూతుళ్లను జీవితంలో స్వతంత్రంగా ఉండటానికి ప్రోత్సహిస్తాడు. కాబట్టి కూతుళ్లు ఎప్పుడూ తండ్రి ఆలోచనలు, సలహాలను ముఖ్యమైనవిగా భావిస్తారు. 

నాన్నతో ఎక్కువ సమయం

నాన్న తన కూతుళ్లతో సరదాగా, ప్రేమగా ఉంటాడు. ఈ కారణంగా కూతురు తన తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంది. 

ఆత్మవిశ్వాసం పెంచేవారు

తండ్రి పిల్లలకు మొదటి గైడ్. ఆడపిల్లలు ఎప్పటికీ బలహీనులు కాదు తమను తాము నిరూపించుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని తన కూతురికి నేర్పుతాడు. అందుకే కూతుళ్లు నాన్నతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. 

కలలను నెరవేర్చడం

ఒక తండ్రి తన కూతురి ప్రతి కలను తనదిగా భావిస్తాడు. తన రక్తం, చెమటను చిందించి, కూతురి కలలను నెరవేర్చడంలో తండ్రి ముందుంటాడు. అందుకే కూతుళ్లు నాన్నను సూపర్ హీరో అంటారు. 

Latest Videos

click me!