ఆఫీస్ లో పోర్న్ చూసే అలవాటు... ఎలా బయటపడాలి?

First Published Jul 3, 2020, 1:04 PM IST

ఆఫీసుల్లోనూ.. పని సమయాల్లోనూ పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు తేలింది. ఇటీవల ఓ వ్యక్తి ఇలాంటి అలవాటుకి బానిసగా మారి దాని నుంచి బయటపడలేక.. నిపుణులను ఆశ్రయించాడు.
 

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో పోర్న్ అనే పదం టచ్ చేయకుండా ఉండలేరన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కాగా పోర్న్ వీడియోలకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గూగుల్ బ్రౌజర్లో పోర్న్ అని టైప్ చేయగానే లెక్కకుమించి సైట్లు కనిపిస్తాయి.
undefined
దీంతో.. ఏదో ఒకటి క్లిక్ చేసి.. పోర్న్ వీడియోలు చూస్తున్నారు. అయితే.. ఇది కాస్త అలవాటుగా మారితే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
చాలా మంది.. ఆఫీసుల్లోనూ.. పని సమయాల్లోనూ పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు తేలింది. ఇటీవల ఓ వ్యక్తి ఇలాంటి అలవాటుకి బానిసగా మారి దాని నుంచి బయటపడలేక.. నిపుణులను ఆశ్రయించాడు.
undefined
అతనుకు 30ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని.. ఆ క్రమంలో పోర్న్ చూడటం అలవాటు అయ్యి.. అది కాస్త వ్యసనంగా మారిందని వాపోయాడు. దాని వల్ల ఆఫీసులో వర్క్ మీద కూడా సరిగా ఏకాగ్రత రావడం లేదని చెప్పాడు.
undefined
కాగా.. అతనికి నిపుణులు సరైన సలహా ఇచ్చారు. పోర్న్ చూడటం తప్పు కాకపోవచ్చు. అయితే.. అతిగా చూడటం మాత్రం ప్రమాదమని చెబుతున్నారు. దానికంటూ ఓ సమాయాన్ని కేటాయించుకోవడంలో తప్పులేదంటున్నారు.
undefined
వారానికి అరగంట లేదా.. వారానికి రెండు గంటలకు ఇలా సమయాన్ని పెట్టుకోని.. దానికి తగినట్లు చూడాలని సూచించారు. అంతేకాకుడా.. ఆఫీసులో కూడా ఎక్కువ స్నేహితుల మధ్య గడిపితే.. ఆ పోర్న్ చూడాలన్న ఆలోచన నుంచి బయటపడవచ్చని చెప్పారు.
undefined
పొరపాటున... మీరు ఆఫీసులో పోర్న్ చూస్తారన్న విషయం మీ స్నేహితులకు తెలిసిపోతే.. అది పెద్ద మచ్చగా ఏర్పడే ప్రమాదం ఉంది. స్నేహితులు సమయం దొరికినప్పుడల్లా ఆ విషయంలో మిమ్మల్ని గేలిచేసే అవకాశం ఉంది.
undefined
ఇదే విషయం మీ ఉన్నతాధికారులకు తెలిస్తే.. మీ ఉద్యోగమే ప్రమాదంలో పడినా ఆశ్చర్యపడనక్కర్లేదు. మహిళా ఉద్యోగులకైతే మీ పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది.
undefined
కాబట్టి.. ఆ ఆలోచనను మార్చుకునే ప్రయత్నం చేయాలి.. ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ.. దానిని మరల్చేందుకే మరేదైనా పనిచేయడం లేదా.. మిమ్మల్ని మీరు బిజీ చేసుకుంటూ ఉండాలి.
undefined
ఇక.. ఎలాగూ.. మీకు 30ఏళ్ల వయసు అని చెబుతున్నారు కాబట్టి.. పెళ్లి వయసు అనే చెప్పవచ్చు. కాబట్టి.. మీకు తగిన యువతి చూసి పెళ్లి చేసుకుంటే.. నిజంగా శృంగార జీవితాన్ని అనుభవించవచ్చు. దాని వల్ల కూడా.. మీరు ఈ పోర్న్ చూడాలన్న ఆశ నుంచి బయటపడే అవకాశం ఉంది.
undefined
click me!