నమ్మకద్రోహమే బ్రేకప్ కు అసలు కారణమా?

First Published | Dec 4, 2023, 2:48 PM IST

ప్రస్తుత కాలంలో బ్రేకప్స్, విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఏదేమైనా వీటికి ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. కానీ చాలా మంది విడిపోవడానికి ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? 
 

వైవాహిక జీవితంలో లేదా లవ్ రిలేషన్ షిప్ లో గొడవలు, కొట్లాటలు జరగడం, మనస్పర్థలు రావడం చాలా సహజం. కొన్ని రోజుల తర్వాత  మళ్లీ కలిసిపోతారు. అన్యోన్యంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ఆ గొడవలు, కొట్లాటలు, మనస్పర్థల వల్లే విడిపోతున్నారు. నిజానికి విడిపోవడానికి ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు. కానీ మనస్తత్వవేత్తలు, సంబంధాల నిపుణుల ప్రకారం.. కొన్ని సాధారణ కారణాలే 90 శాతం బ్రేకప్స్ కు దారితీస్తున్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

break up

శారీరక సంబంధం తగ్గడం

వైవాహిక జీవితంలో శారీరక  సంబంధం చాలా అవసరం. శృంగార సంబంధానికి శారీరకంగా, మానసికంగా సాన్నిహిత్యంగా ఉండటం చాలా చాలా ముఖ్యం. దంపతుల మధ్య శారీరక సంబంధం లేదా భావోద్వేగ సాన్నిహిత్యం తగ్గినప్పుడు వారి సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఇది భావోద్వేగ దూరాన్ని ఇద్దరి మధ్యన పెంచుతుంది. దీనివల్లే దంపతులు విడిపోవాలనుకుంటారు. అందుకే దంపతుల మధ్య శారీరక సంబంధం బాగుండాలి. 

Latest Videos


కమ్యూనికేషన్ లేకపోవడం

ఒకరికొకరు బహిరంగంగా మాట్లాడుకోకపోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, గొడవలు వస్తాయి. జంటలు మాట్లాడుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి కష్టపడుతున్నప్పుడు.. ఇది అపార్థాలు, గొడవలకు దారితీస్తుంది. అలాగే ఇది మీ ఇద్దరి మధ్య భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. ఇక రానురాను మీ మధ్య నమ్మకం పోతుంది. దూరం పెరుగుతుంది. చివరికి మీ ఇద్దరు విడిపోతారు. మీ రిలేషన్ షిప్ మెరుగ్గా ఉండాలంటే మాత్రం మీ ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకమే బంధానికి పునాది. 
 

ఒంటరితనం

జంటలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా దగ్గర ఉండటం అవసరం. జంటలు ఒకరికొకరు మానసికంగా దూరమైనట్టుగా అనిపిస్తే  ఇద్దరికీ ఒంటరివాళ్లం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది భావోద్వేగ అసంతృప్తిని కలిగిస్తుంది. మీరిద్దరుభావోద్వేగపరంగా దగ్గరగా లేనప్పుడు విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది. 
 

నమ్మకం

ఎలాంటి బంధానికైనా సరే.. నమ్మకమే పునాది. నమ్మకంతోనే ఇద్దరు కలిసి సంతోషంగా జీవితాన్నిగడుపుతారు. అయితే ఈ నమ్మకం పోయినప్పుడు లేదా నమ్మకద్రోహం చేసినప్పుడు మీ మీదున్న ప్రేమ పోతుంది. నమ్మకం మొత్తమే ఉండదు. మిమ్మల్ని నమ్మడం పెద్ద సవాలుగానే మారుతుంది. నమ్మకద్రోహం చేసేవాళ్లతోనే ఎవరూ బతకాలనుకోరు. అందుకే ఇది కూడా బ్రేకప్ కు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. 

తేడాలు

దంపతులే అయినా.. ఇద్దరి మధ్య ఎన్నో తేడాలు ఉంటాయి. అంటే వారి లక్ష్యాలు, విలువలు, ఆసక్తులు, జీవనశైలిలో ఎన్నో తేడాలు ఉంటాయి. అయితే కొంతమంది వీటికి సర్దుకుపోతే.. కొంతమంది మాత్రం ఇద్దరికీ కలవదని విడిపోవడమే బెటర్ అని ఫీలవుతారు. ముఖ్యంగా ఈ తేడాలను ఎత్తిచూపడం వల్ల దంపతుల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇది అసంతృప్తి భావనలకు దారితీస్తుంది. ఇది కూడా విడిపోవడానికి దారితీస్తుంది. 

click me!