చాలామంది దంపతులు పెళ్లి అయ్యాక బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఇప్పుడు చాలామంది బెస్ట్ ఫ్రెండ్ నే భాగస్వామిగా కోరుకుంటున్నారు. ప్రాణ స్నేహితులైన వ్యక్తితో ప్రేమలో పడటం సహజమే కానీ ఆ స్నేహం తెగిపోతుందనే భయం కొంతమంది తమ లవ్లీ ఎక్స్ప్రెస్ చేయరు.
అటువంటి పరిస్థితులలో ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడానికి కొన్ని చిట్కాలని ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్ తో నేరుగా ప్రేమను వ్యక్తపరచడం కన్నా తన మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అతనికి అర్థమయ్యే విధంగా నడుచుకుంటే అవతలి వాళ్ళు..
మీ ఇంటెన్షన్ ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అప్పటికే వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఒక మంచి హ్యాపీ మూడ్ లో ఉండగా తనకి మీ లవ్ మీ ఎక్స్ ప్రెస్ చేయండి తను మీది మీకున్న అభిప్రాయాన్ని చెప్పండి.
మీరు తనకి ఫ్యూచర్లో ఎలాంటి భరోసా ఇవ్వగలరు నమ్మకం కలిగేలాగా చెప్పండి. తర్వాత నిర్ణయాన్ని తనకే వదిలేయండి. అంతేగాని ప్రేమించమంటూ పదేపదే అవతలి వ్యక్తి వెంట పడటం మంచిది కాదు తన దృష్టిలో మీరు పలుచబడిపోయే అవకాశాలు ఉంటాయి.
మిమ్మల్ని చూడగానే ఆకర్షించేలాగా, మీతో ఇంకాసేపు గడిపితే బాగుంటుంది అనే లాగా ప్రవర్తించండి. అలాగే మీ భవిష్యత్తు ప్రణాళిక వారికి చెప్పండి దానికోసం కష్టపడండి. భవిష్యత్తుపై ఫోకస్ పెట్టండి.
మంచి ఉద్యోగం జీవితం పట్ల విజన్ ఉన్న వారిని అందరూ ఇష్టపడతారని గుర్తించండి. అంతేగాని అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఇష్టపడిన వ్యక్తి చేజారి పోవచ్చు. సో ఈ టిప్స్ పాటించి మీ లవ్ ని సక్సెస్ చేసుకోండి.