చాలామంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సరియైన నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటారు దీనికి కారణం గదిలో ఉండే వాస్తు దోషమేమో ఒకసారి పరిశీలించండి. గదిలో వాస్తు సరిగ్గా లేకపోతే నిద్ర పట్టకపోవడమే కాదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకే పడక గదిలో ఉండవలసిన వస్తువులు ఏమిటో ఉండకూడని వస్తువులు ఏమిటో చూద్దాం.
పడక గదిలో నలుపు రంగు వస్తువులు ఉంటే కచ్చితంగా భార్యాభర్తల మధ్యన సఖ్యత లోపిస్తుంది. నల్లటి వస్తువుల ప్రభావం మనసు మీద నెగిటివ్ ఇంప్రెషన్స్ ని కలిగిస్తుంది కాబట్టి పడకగదిలో నలుపు రంగు వస్తువులను ఉంచకండి. అలాగే పడకగదిలో టీవీ, లాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి ఉంచకండి.
ఇనుప వస్తువులు మనసు మీద చెడు ప్రభావాన్ని చూపించడం వలన నిద్ర పట్టకపోవచ్చు. అలాగే పడకగదిలో హింసని ప్రేరేపించే పెయింటింగ్స్ విషాదాన్ని సూచించే పెయింటింగ్స్ ఉండకుండా చూసుకోండి. పడకగదిని ఎప్పుడూ లైట్ కలర్ లో ఉండేలాగా డిజైన్ చేసుకోండి బెడ్ షీట్స్ కర్టన్స్ కూడా లైట్ కలర్ లో ఉండే లాగా డిజైన్ చేసుకోండి.
అవి మనసుకి ప్రశాంతతని కలిగిస్తాయి. అలాగే బెడ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఫోన్ లని పక్కన పెట్టేయండి దీనివల్ల మీ ఇద్దరు మాట్లాడుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మీ బెడ్ రూమ్ ని తాజా పూల పరిమళాలతో నిండి ఉండేలాగా చూసుకోండి.
దీనివలన మనసు ప్రశాంతంగా ఉండి ఇద్దరి మధ్యన ప్రేమ అనురాగాలు చిగురిస్తాయి ఎండిపోయిన పువ్వులను బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు. అలాగే పడక గదిలో ఎప్పుడూ మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు అద్దం ఎప్పుడు ప్రతికూల శక్తులని ఆకర్షిస్తుంది.
ఇది వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులని తీసుకువస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం పడకగదిని శుభ్రంగా ఉంచుకోవడం. దీనివల్ల వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.