సాన్నిహిత్యం అనేది ఇద్దరి మధ్య ఏర్పడే స్నేహం వలన ఏర్పడుతుంది. ఒక మనిషితో సాన్నిహిత్యం ఏర్పడిందంటే అది ఆ మనిషిని ఎక్కడవరకైనా తీసుకెళ్తుంది ఎదుటి మనిషి కోసం ఏం చేయటానికి అయినా సిద్ధపడేలాగా చేస్తుంది.
అవతల వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, వారిని ఇంప్రెస్ చేయాలని చూడటం ఎక్కువగా వారి గురించి ఆలోచించడం వంటివి చేస్తూ ఉంటాము. అయితే ఈ సాన్నిహిత్యం పెరగటానికి అనేక స్థాయిలో ఉంటాయి. చాలామందికి ఇవి ఏమిటో తెలియకుండానే సన్నిహిత్యం పెరిగిపోతూ ఉంటుంది.
అయితే మీరు మీ భాగస్వామితో మీ రిలేషన్ ఏ స్టేజ్ లో ఉందో ఈ విధంగా తెలుసుకోండి. మొదటిది నార్మల్ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ లో ఒకరి గురించి ఒకరు లోతుగా అభిప్రాయాలు తెలుసుకోలేరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ పొడిపొడి ప్రశ్నలలోనే ఉంటుంది.
ఇంతకుమించి లోతుగా వెళ్లలేరు ఈ స్టేజ్ లో. ఇంక నెక్స్ట్ కమ్యూనికేషన్ స్టేజ్ లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఒకరి అభిప్రాయాన్ని ఒకరు చెప్పడం వరకు ఉంటాయి ఇందులో పెద్ద పెద్ద అంశాల గురించిన ప్రస్తావని ఎక్కడ ఉండదు. ఈ స్టేజిలోనే ఒకరి మీద ఒకరికి నమ్మకం కుదురుతూ ఉంటుంది.
అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా అర్థం చేసుకోవటం అనేది ఈ స్టేజ్ లోనే జరుగుతుంది. ఇక ఆ తర్వాత స్టేజ్ ఆశలు మరియు కలలను పరస్పరం పంచుకుంటూ ఉంటారు జీవితంలో ఈ స్టేజ్ లోనే మన కలలని పంచుకోవటం మరియు వాటిని కలిసి నిర్మించుకోవడం ప్రారంభిస్తాము.
అవతలి వ్యక్తికి వారు అనుభూతిని పంచుకోవడానికి అవకాశం ఇస్తున్నప్పుడు మీ సొంత అనుభూతిని గుర్తించగలగడం కూడా ఇక్కడ ముఖ్యం. ఇక ఆఖరి స్టేజ్ ఇందులో ఆలోచనలు భయాలు వైఫల్యాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు దీనికి లోతైన నమ్మకం అవసరం. దీనిని బట్టి మీ రిలేషన్ ఏ స్టేజ్ లో ఉందో ఒక అంచనాకి రావచ్చు.