దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. దీనికి దూరంగా ఉండాలి..!

First Published | Dec 1, 2021, 1:09 PM IST

మీ ఇాద్దరి బంధాన్ని ఏ విషయం ఇబ్బంది పెడుతోంది..? మీలో ఉన్న అభద్రతా భావాలు ఏంటి..? వాటిని ఎలా  పరిష్కరించుకోవాలి అనే విషయాలను ముందుగా లిస్ట్ తయారు చేసుకోవాలట. అలా లిస్ట్ చేసుకోవడం వల్ల.. ముందుగా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది.

దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని కోరుకోనివారు ఎవరుంటారు చెప్పండి..? అయితే...  ఏ రిలేషన్ బాగుండాలి అన్నా.. వారి మధ్య ఈర్ష్యకి చోటు ఇవ్వకూడదట. ఈ ఈర్ష్య ఉంటే.. ఆ బంధం ముందుకు సాగడం కష్టమట. మరి ఇద్దరి మధ్య ఈ ఈర్ష్య( Jealous)  లేకుండా.. ఆనందంగా ఉండాలంటే.. ఏం  చేయాలంటే.. ముందు ఆ ఈ ర్ష్యను దూరం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మీ పార్ట్ నర్.. మీ తో కాకుండా మరెవరితో అయినా సరదాగా మాట్లాడినా చాలా మంది జలస్ ఫీలౌతూ ఉంటారు. కానీ దానిని బయట పెట్టకుండా లోలోపలే ఉంచుకొని సమస్యలు తెచ్చుకుంటారు. అలా కాకుండా.. మీరు జెలస్ ఫీలౌతున్న విషయాన్ని వారికి తెలియజేయాలట. అది మీకు నచ్చడం లేదనే విషయాన్ని సున్నితంగా చెప్పేయాలట,


మీ ఇాద్దరి బంధాన్ని ఏ విషయం ఇబ్బంది పెడుతోంది..? మీలో ఉన్న అభద్రతా భావాలు ఏంటి..? వాటిని ఎలా  పరిష్కరించుకోవాలి అనే విషయాలను ముందుగా లిస్ట్ తయారు చేసుకోవాలట. అలా లిస్ట్ చేసుకోవడం వల్ల.. ముందుగా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది.

మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందుగా.. మీరు మీలోని అభద్రతా భావాలను రాసుకొని.. వాటికి పరిష్కారమేంటో ఆలోచించాలి. ముందు సమస్యేంటో తెలిస్తేనే దాని పరిష్కారం గురించి ఆలోచించగలం అనే విషయాన్ని తెలుసుకోవాలి.
 

అసలు.. మీలో ఇన్ సెక్యురిటీస్ ఎందుకు కలుగుతున్నాయి.. దాని గల కారణం ఏంటి అనే విషయాన్ని ఆలోచించాలి. అదే విషయాన్ని మీ పార్ట్ నర్ తో చర్చించి.. దాని నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషించాలి.

ఇక.. ఏ విషయమైనా పార్ట్ నర్ తో మనసు విప్పి మాట్లాడటం చాలా అవసరం. అది తప్పు అయినా.. ఒప్పు అయినా.. మీకు ఆనందాన్ని ఇచ్చే విషయం అయినా.. బాధ కలిగించే విషయమైనా మాట్లాడుకోవాలి. దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఆ గ్యాప్ వస్తే.. దానిని మళ్లీ పూడ్చుకోవడం కష్టం. కాబట్టి.. గ్యాప్ రాకుండా చూసుకోవాలి.

ఇక.. ప్రేమలో ఉన్నవారు చాలా మంది తమ పార్ట్ నర్ గురించి ఆలోచిస్తూ...తమ గురించి పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. కాబట్టి.. అలా కాకుండా.. ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మానసికంగా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.


ప్రతి విషయంలోనూ మిమ్మల్ని జడ్జ్ చేయకుండా.. మిమ్మల్ని అర్థం చేసుకునేవారితో.. మీ సమస్య గురించి చర్చించాలి. వారి సలహాలు తీసుకొని.. మీ సమస్యను పరిష్కరించుకునేలా చూడాలి.

దంపతుల మధ్య కొంచెంగా.. జెలస్, కొద్దిపాటి పొసెసివ్ నెస్ ఉంటే.. ఆ బంధం అందంగానే ఉంటుంది. కానీ.. అది మరీ ఎక్కువ అయితేనే.. సమస్యలు వస్తాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. 

Latest Videos

click me!