ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బాధ్యతలను (Responsibilities) సమానంగా పంచుకొని తమ ఉద్యోగ పనులలో బిజీ అయిపోతున్నారు. ఉద్యోగపరంగా, బయట సమస్యల కారణంగా ఇద్దరూ కాస్త ఒత్తిడికి (Stress) గురవడం సహజమే.
అయితే వారు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే సమయం తగ్గి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. దీంతో ఇద్దరి దాంపత్య జీవితంలో అభద్రత (Insecurity), అసహనం (Impatience) ఏర్పడుతోంది. అప్పుడు వారి మనసులు తమ భాగస్వామి తమపై ప్రేమ తగ్గిందని భావిస్తారు.
నా గురించి అస్సలు పట్టించుకోలేదని భాగస్వామితో వాదనకు దిగుతారు. కనుక మీ మధ్య ఏలాంటి వాదనలు (Arguments) రాకుండా ఉండాలంటే ఇంటి పనులను సమానంగా పంచుకోవాలి. ఒకరి ఇబ్బందిని మరొకరు అర్థం చేసుకుని వారికి సహాయం (Help) చేస్తూ వారిలోని అభద్రతా భావాన్ని తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేయాలి.
అప్పుడే మీ మధ్య బంధం (Bonding) మరింత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను (Views) మరొకరు గౌరవిస్తూ వాటిని అనుసరిస్తూ మీ మధ్య ఎటువంటి సమస్యలు రావు. మీ లోని లోపాలను (Errors) ఎత్తి చూపించుకునే ప్రయత్నం చేయరాదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, పని ఒత్తిడి ఉన్నా ఇంటిలోకి రాగానే మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
మీ భాగస్వామితో ఏకాంతంగా గడపడానికి ఒక సమయాన్ని (Time) కేటాయించాలి. సమయం దొరికినప్పుడు మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి కొంత సమయం గడిపితే మీ మనసుకు ప్రశాంతత (Calmness) కలుగుతుంది. మీ కోసం మీరు గడిపే సమయం మీ మధ్య ప్రేమను పెంచి మీ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేస్తుంది.
భాగస్వామి మీద మీకున్న ప్రేమను మాటల రూపంలో కాకుండా తనకు ఇష్టమైన పనులు చేస్తూ ఆ విధంగా తెలియజేస్తే వారు చాలా సంతోషిస్తారు (Will be happy). భార్యాభర్తల మధ్య అహం (Ego) ఉంటే అది దాంపత్య జీవితానికి మంచిది కాదు.
అహం కారణంగా మీ మధ్య గొడవలు (Conflicts) ఏర్పడి మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక సమస్య వచ్చినప్పుడు పంతానికి పోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం కొత్తగా (New Life) మారుతుంది.