అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పెళ్లి తర్వాత జీవితం చాలా మారిపోతుంది. ఇది ఇప్పటికే పెళ్లయిన వారికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. పెళ్లి తర్వాత ఆనందంతో పాటు.. చికాకులు కూడా వచ్చేస్తాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. అయితే.. ఆనందమైనా, బాధైనా ఇది భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, మీరు వివాహం ,ఎంచుకున్న జీవిత భాగస్వామి గురించి జాగ్రత్తగా ఉండాలి.