ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా ఏది మంచిదనే అయోమయంలో ఉన్నారా?

First Published | Nov 28, 2021, 11:22 AM IST

పెళ్లి అనే పవిత్రమైన బంధంతో ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు. పెళ్లి అనే శుభకార్యంతో పెద్దల సమక్షంలో, ఆశీస్సులతో ఇద్దరు వ్యక్తులు వారి వైవాహిక బంధంలోకి అడుగు పెడతారు. అయితే చాలామంది ప్రేమ వివాహం మంచిదా, పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదా అనే అయోమయంలో ఉంటారు. వారు ఏ దారిని ఎంచుకోవాలో తెలియక వారి మనసు గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ప్రేమ పెళ్ళా (Love marriage).. పెద్దలు కుదిర్చిన పెళ్ళా (Arrange marriage).. అనే విషయంపై అవగాహన కలిగించడమే.
 

ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట ఒకరి గురించి ఒకరికి పెళ్లికి ముందే పూర్తిగా తెలుసుకుని సులభంగా జీవితాన్ని (Life) ముందుకు కొనసాగిస్తారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళతో ఒక్కటై నా జంట ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ పెద్దల సహకారంతో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ వారి జీవితాన్ని అన్యోన్యంగా (Reciprocity) కొనసాగిస్తారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భాగస్వామి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ అతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తారు. అయితే ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అంటే మాత్రం అది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
 

ప్రేమ పెళ్లిలో ఒక‌రి గురించి మరొకరు బాగా తెలుసుకొని వారిలోని లోపాలను (Errors) కూడా మనస్ఫూర్తిగా (Mentally) అంగీకరించి వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. అదే పెద్దల కుదిర్చిన పెళ్లిలో తల్లితండ్రుల అంగీకారం ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే వారిని చేసుకునేందుకు ఇష్టపడతారు. తల్లిదండ్రులు వారి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి పెళ్ళి చేస్తారనే నమ్మకం. తల్లిదండ్రుల మాటకు విలువనిస్తూ వారు ఏ వ్యక్తిని చూపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ప్రేమించుకున్న ఇద్దరి వ్యక్తుల అంగీకారం ఉంటే చాలు. వారు ఇతరుల అంగీకారం కోసం ఎదురుచూడరు.
 


అదే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే ఇందులో కుటుంబ సభ్యుల అంగీకారం (Acceptance) ముఖ్యం. భాగస్వామి గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా వివాహం జరిగి పోతుంది పెద్దలపై నమ్మకంతో (Confidence). ప్రేమ పెళ్లిలో ప్రేమించిన వ్యక్తిని భాగస్వామిగా పొందిన క్షణం ఏదో సాధించాననే సంతోషం వారిలో కనబడుతుంది. ఆ క్షణం వారికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి లో పెళ్లి జరిగే ఆ క్షణంలో చాలా టెన్షన్ గా ఉంటుంది. తాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నామని, ఇంత వరకు పరిచయం లేని వ్యక్తితో తొలిరేయి అని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
 

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత వారితో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన తరువాత భాగస్వామిలోని  కొత్త విషయాలు బయటపడడంతో గొడవలు ఏర్పడిన వారి మధ్య  ప్రేమ (Love) ఈ గొడవలను లెక్కచేయదు. అదే విధంగా పెద్దలు కుదిర్చిన వివాహంలో గొడవలు ఏర్పడిన పెద్దల సహకారంతో వాటిని పరిష్కరించుకుంటూ వారి బంధం మరింత గట్టిగా బలపడుతుంది. ప్రేమ పెళ్లిలో భార్య ఇష్టాయిష్టాలు (Likes) పూర్తిగా తెలియడంతో ఇద్దరూ కలిసి బాధ్యతలను సంతోషంగా పంచుకుంటారు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అత్తమామల జోక్యం కూడా ఉంటుంది.
 

భర్త, అత్తమామల సహకారంతోనే ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. లేదంటే కష్టం కాస్త కష్టంగా ఉంటుంది. ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా భార్యభర్తల మధ్య సరైన సఖ్యత ఉంటేనే ఆ బంధం బలంగా పది కాలాల పాటు ఉంటుంది. ఇలా ఉండాలి అంటే వారి మధ్య ప్రేమానురాగాలు (Affections), నమ్మకం (Believe), ఆత్మవిశ్వాసం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది ఉండాలి.

Latest Videos

click me!