ప్రేమను వ్యక్తపరచాలి..
ఇలాంటి సమయంలో భార్య విసుగును భర్త సరిచేయకపోతే, కొంతమంది మహిళలు వివాహేతర సంబంధాలను వెతుక్కుంటారు. తన భార్య దాంపత్య జీవితంలో సంతృప్తిగా ఉందో లేదో భర్త తెలుసుకోవాలి. ప్రేమ, ఆప్యాయత ఉంటే సరిపోదు. దాన్ని వ్యక్తపరచాలి. అలా చేయడంలో విఫలమైతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
దూరం పెరగడం
కొంతమంది సౌకర్యం, సమాజం కోసమే పెళ్లి చేసుకుంటారు. ఈ బంధంలో ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ ఉండవు. ఇలాంటి దంపతుల మధ్య ఉండే దూరం వారిని మరో బంధం వైపు నడిపిస్తుంది. కొందరు ఆ బంధం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు మహిళలు తాము కోరుకున్న ప్రేమ వేరే వ్యక్తిలో కనిపిస్తే.. అతనివైపు మొగ్గుచూపుతారు.